మూడు రోజుల సమ్మె జీతాన్ని ప్రతి కార్మికుడికి చెల్లించాలని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సోమారపు సత్యనారాయణ అన్నారు. సోమవారం గోదావరిఖనిలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు. సింగరేణిలో జరిగిన సమ్మె రాష్ర్ట ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన సమ్మెగా ఆయన అభివర్ణించారు. సింగరేణిలో ఇప్పటి వరకు జరిగిన ప్రతి సమ్మెలో బొగ్గు ఉత్పత్తి జరిగిందన్నారు. కానీ ఈ మూడు రోజుల సమ్మెలో బొగ్గు ఉత్పత్తి జరగలేదంటే యాజమాన్యం, రాష్ర్ట ప్రభుత్వ తీరును…
సింగరేణిలో సమ్మె సైరన్ మోగడంతో.. కార్మిక సంఘాలు ఒక్కటయ్యాయి. ఒక్కరోజు సమ్మె కాస్తా.. మూడు రోజులకు పెరిగింది. అయితే ఈ సమ్మె ఎవరి కోసం? సమ్మె వెనక ఇంకేదైనా బలమైన ఆలోచనలు ఉన్నాయా? బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నట్టు చెబుతున్నా.. కార్మిక వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సింగరేణిలో 3 రోజుల సమ్మె..! తెలంగాణలో నల్లబంగారు గనులు రాష్ట్రానికి సిరులు కురిపిస్తున్నాయి. రాష్ట్రంలో పదకొండు ఏరియాల్లో విస్తరించిన గనుల్లో 45…
కొత్తగూడెంలోని సింగరేణి గనుల్లో సమ్మె సైరన్ మోగింది. నాలుగు బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మికులు సమ్మె చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఐదు డిమాండ్లను యాజమాన్యం ముందు ఉంచారు. కార్మికుల డిమాండ్లు ఏంటంటే… కళ్యాణి ఖని బ్లాక్ 6, కొయ్యగూడెం బ్లాక్ 3, సత్తుపల్లి బ్లాక్ 3, శ్రావణి పల్లి బ్లాకులను ప్రైవేటీకరణ చేయడాన్ని ఉపసంహరించుకోవడం, అన్‌ఫిట్ కార్మికుల డిపెండెంట్ల వయసును 35 నుంచి 40 ఏళ్లకు పెంచడం, కార్మికుల అలియాస్ పేర్లను మార్చడం, ఏడాది…
సింగరేణి గనుల్లో మరో ప్రమాదం జరిగింది.. మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం శ్రీరాంపూర్ డివిజన్ ఎస్సార్పీ 3 గనిలో ఇవాళ ఉదయం గని పైకప్పు కూలిన ఘటనలో నలుగురు కార్మికులు ప్రాణాలు విడిచారు.. ఈ ప్రమాదంలో గనిలోని 21 డిప్ 24 లెవల్, 3ఎస్‌పీ 2 సీం వద్ద గని పైకప్పు రక్షణ చర్యలు చేపడుతున్న టింబర్‌మెన్ బేర లచ్చయ్య, సపోర్ట్‌మెన్ వీ క్రిష్ణారెడ్డి, బదిలీ వర్కర్లు గడ్డం సత్యనర్సింహారాజు, రెంక చంద్రశేఖర్ మృతిచెందారు.. పై కప్పు…
దేశవ్యాప్తంగా విద్యుత్‌కు భారీగా డిమాండ్ పెరిగిన తరుణంలో.. బొగ్గు తవ్వకాలను పెంచే దిశగా కేంద్రం చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా మంగళవారం దేశవ్యాప్తంగా 88 బ్లాకుల వేలంపై ప్రకటన విడుదల చేసింది. కోల్‌మైన్స్ స్పెషల్ ప్రొవిజన్స్ యాక్టు-2015, మైన్స్, మినరల్స్ యాక్టు-1957 ప్రకారం వేలం వేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఝార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, బెంగాల్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, అస్సాం రాష్ట్రాల్లోని బ్లాకులతో పాటు తెలంగాణకు చెందిన నాలుగు గనులు వీటిలో ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం…
దేశంలో బొగ్గునిల్వల సమస్య ఏర్పడింది. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో బొగ్గు నిల్వలు తగ్గిపోవడంతో విద్యుత్ సరఫరాలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని, అదే జరిగితే విద్యుత్ సంక్షోభం ఏర్పడవచ్చని రాష్ట్రాలు ఆందోళన చెందుతున్నాయి. దీనిపై నిన్నటి రోజుక కేంద్రం ప్రధాని నేతృత్వంలో సమీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. అనంతరం దేశంలోని బొగ్గు నిల్వలపై కేంద్రం దృష్టి సారించింది. ఇందులో భాగంగానే తెలంగాణలో బొగ్గు నిల్వలపై కేంద్రం దృష్టి పెట్టింది. దేశంలో మొత్తం 116 విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు…
మణుగూరు సింగరేణి ఓపెన్ కాస్ట్ 2 లో ప్రమాదం చోటుచేసుకుంది. ఎమర్జెన్సీ కోసం తిరిగే బొలెరో వాహనం మీదకు డంపర్ ఎక్కింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. ప్రమాదం జరిగిన వెంటనే బాధితులను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మగ్గురు మృతి చెందినట్టు సమాచారం. సింగరేణిలో పనిచేస్తున్న ఇద్దరు కార్మికులతో పాటు బొలెరో డ్రైవర్ కూడా మృతిచెందారు. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును అంచనా వేస్తున్నారు. Read: ప్రాణాలకు తెగించి…
తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంచింది.. అయితే, ప్రభుత్వ ఉద్యోగుల మాదిరే సింగరేణి కార్మికుల పదవీ విరమణ వయస్సును 61 ఏళ్లకు పెంచాలని కోరుతూ ఇవాళ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి కోరింది. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ప్రతినిధులు, సింగరేణి ప్రాంత ఎమ్మెల్యే, ఎంపీలు ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ను కలిసి.. ఈ మేరకు విజ్ఞప్త చేశారు.. అయితే, వారి వినతిపై సీఎం సానుకూలంగా…