Singareni : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో ఉన్న సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో నిన్న సాయంత్రం నుంచి విజిలెన్స్ దాడులు కొన సాగాయి. సి ఎం ఓ లో మెడికల్ అధికారి గా ఉన్న ఆమె భర్త ,కూతురు సెల్ ఫోన్ విజిలెన్స్ శాఖ సంబంధించిన పైళ్ళు స్వాధీనం చేసుకొని విచారణ చేపట్టినట్టుగా తెలుస్తుంది. ఈనెల 31న రిటైర్మెంట్ కావలసి ఉండగా తాజాగా విజిలెన్స్ అధికారులు దాడులు చేసి ఫైళ్లను స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇటీవల జరిగిన మెడికల్ అన్ ఫిట్ లో జరిగిన చీఫ్ మెడికల్ అధికారిని సింగరేణి విజిలెన్స్ కు సంబంధించిన విజిలెన్స్ శాఖ అధికారులు వచ్చి విచారణ చేసినట్లుగా తెలుస్తుంది . ఈ మేరకు చీఫ్ మెడికల్ ఆఫీసర్ ని అదే విధంగా ఆమెకు సంబంధించిన వారిని సింగరేణి ప్రధాన కార్యాలయానికి విజిలెన్స్ అధికారులు తీసుకొని వెళ్లారు అధికారి అదేవిధంగా అధికారికి సంబంధించిన బంధువుల ఫోన్ లను విజిలెన్స్ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
e-KYC: రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. ఈ-కేవైసీ గడువు పొడిగింపు