Bhatti Vikramarka: సింగరేణి నీ కాపడుతాం.. ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళనివ్వం డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క అన్నారు. భద్రాద్రి కొత్తగూడెంలో కాంగ్రెస్ జన జాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
Singareni Jobs: సింగరేణిలో మొత్తం 485 ఉద్యోగ ఖాళీలను నేడు విడుదల చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 317 డైరెక్ట్, 168 ఇంటర్నల్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు సింగరేణి సీఎండీ తెలిపారు.
సింగరేణి కాలరీస్ బొగ్గు ఉత్పత్తితోపాటు థర్మల్, సోలార్ రంగంలోనూ విజయవంతంగా అడుగుపెట్టిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా సోలార్ రంగంలో ఉండే అవకాశాలను అందిపుచ్చుకోవాలని సంస్థ ఛైర్మన్ మరియు ఎండీ ఎన్.బలరామ్ పేర్కొన్నారు. ముఖ్యంగా సంప్రదాయేతర ఇంధన వనరులను ప్రోత్సహించే ఉద్దేశంతో ఇతర రాష్ట్రాల్లో సోలార్ ప్రాజెక్టులు చేపట్టాలని అధికారులకు సూచించారు. సింగరేణి థర్మల్, సోలార్ విద్యుత్ సమీక్ష సమావేశంలో ఆయన సంబంధిత అధికారులతో సమగ్రంగా చర్చించారు. రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో సోలార్ రంగంలోకి అడుగుపెట్టి కమర్షియల్…
Singareni: సింగరేణి కార్పొరేషన్ ఛైర్మన్‌గా బలరాం నాయక్ నియమితులయ్యారు. సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ పదవీకాలం ముగియడంతో జీఏడీకి రిపోర్టు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Singareni Elections 2023 Polling Begins: సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయింది. 11 డివిజన్‌లలోని 84 పోలింగ్ కేంద్రాల్లో బుధవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఈ పోలింగ్ సీక్రెట్ బ్యాలెట్ పద్దతిలో సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. సింగరేణి విస్తరించి ఉన్న మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, కుమురం భీం ఆసిఫాబాద్, ఖమ్మం జిల్లాల్లో పోలింగ్ జరుగుతోంది. 13 కార్మిక సంఘాలు ఎన్నికల బరిలో ఉన్నాయి.…
సింగరేణి ఎన్నికలు జరగకుండా కోర్టులో కేసులు వేస్తే స్టే తెచ్చుకొని గత సీఎం కాలం వెల్లదీశాడు.. గతంలో కార్మికుల సమస్యలు పరిష్కారం చేయ్యాని వాళ్ళు ఇప్పుడు ప్రతి పక్షంలో మళ్ళీ అదే వాగ్దనాలతో మీ ముందుకు వస్తున్నారు జాగ్రత్త అంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
సింగరేణి కార్మికులకు రూ. 20 లక్షల వడ్డీలేని రుణాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సింగరేణి కార్మికులను తాను ఆదుకుంటానని, కార్మికుల న్యాయమైన డిమాండ్ల కోసం కృషి చేస్తానన్నారు. గడిచిన పది సంవత్సరాలు నామవాత్ర ఉద్యోగాలు నియమించారని, కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలను చేపట్టే కార్యక్రమం ప్రారంభించిందని పొంగులేటి చెప్పారు. ఇన్‌కమ్ ట్యాక్స్ మినహాయింపు కార్యక్రమాన్ని తమ ప్రభుత్వం తీసుకోబోతుందని చెప్పుకొచ్చారు. ఇల్లందు సింగరేణి జెకే ఓపెన్ కాస్ట్ ఆఫీస్…
Singareni Elections: సింగరేణి ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. ఎన్నికలను వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో వేసిన పిటిషన్ పై నేడు విచారణ జరిపింది. హైకోర్టు నిర్ణయం పై 27న జరిగే ఎన్నిక ప్రక్రియపై ఉత్కంఠ నెలకొంది. ఎన్నికలను డిసెంబర్ 27కు బదులు వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించాలని IA పిటిషన్ దాఖలైంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో ఎన్నిక నిర్వహణకు సమయం కావాలని యూనియన్ తరపున సీనియర్ కౌన్సిల్ కోరారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో సంబంధం…
Telangana High Court: సింగరేణి ఎన్నికల్లో మరో పెద్ద ట్విస్ట్. ఎన్నికలను వాయిదా వేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కార్మిక సంఘాల మధ్య పోరు తారాస్థాయికి చేరడమే ఇందుకు కారణం.
Coal belt: కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం దిశగా దూసుకుపోతోంది. 119 స్థానాల్లో మ్యాజిక్ ఫిగర్ 60ని దాటిన కాంగ్రెస్, స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శిస్తోంది. ముఖ్యంగా ఉత్తర, దక్షిణ తెలంగాణల్లో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేకుండా పోయింది. ఇదిలా ఉంటే సింగరేణితో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్న కోల్బెల్ట్ నియోజకవర్గాల్లో హస్తం హవా స్పష్టంగా కనిపిస్తోంది.