సిద్దిపేటలో మెగా డ్రోన్ షో నిర్వహించారు. తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో డ్రోన్ షోను ఏర్పాటు చేశారు. కోమటి చెరువు వేదికగా 450 డ్రోన్ లతో కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి మంత్రులు హరీశ్ రావు, శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథులుగాగా హాజరై.. షోను తిలకించారు. చెరువు చుట్టు దాదాపు 15 వేల మందితో కేరింతల మధ్య సందడి చేయగా.. సింగర్ గీతామాధురి తన పాటలతో యువతను ఉత్తేజపరిచారు.
Read Also: Divi Vadthya : పల్లెటూరి భామ లా మెరిసిన దివి..స్టన్నింగ్ పోజులతో అదరగొడుతుందిగా..
ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. కేసీఆర్ కలలు కన్న సిద్దిపేట సాకరమవుతుందని తెలిపారు. నెలలోపు సిద్దిపేటకి రైలు రాబోతుందన్నారు. కోమటి చెరువులో స్కై రెస్టారెంట్ పెట్టాలని.. టన్నెల్ అక్వేరియం, వర్చువల్ రియాలిటీ డోమ్ థియేటర్ కూడా పెట్టాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ని కోరుతున్నట్లు హరీష్ రావు తెలిపారు. అంతేకాకుండా.. సిద్దిపేట అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని మంత్రి అన్నారు.
Read Also: Jayaprada: పెళ్లైన వ్యక్తిని పెళ్ళాడి.. విషం తాగి.. ఆత్మహత్యకు ప్రయత్నించి
డ్రోన్ షో లో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. మంత్రి హరీష్ రావు తమ అందరికి ఆదర్శప్రాయుడని కొనియాడారు. మంత్రి హరీష్ రావు ఎక్కడికిపోయినా, ఎక్కడున్నా, ఏం చూసినా ఇది సిద్దిపేటకి కావాలి అంటాడని తెలియజేశారు. సిద్దిపేటను ఆదర్శంగా తీసుకుని తాము కూడా మహబూబ్ నగర్ లో కొన్ని పనులు చేస్తున్నామని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.