Minister Harish Rao: బహుజనుల ఆత్మగౌరవానికి ప్రతీక వీరనారి చాకలి ఐలమ్మ అని మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సిద్దిపేట హౌసింగ్ బోర్డు సర్కిల్‌లోని చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకుని ఆదివారం ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జోహార్ చాకలి ఐలమ్మను మంత్రులు కొనియాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వీరనారి ఐలమ్మ జయంతి, జన్మదిన వేడుకలను అధికారికంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిర్ణయించడం మనందరికీ గర్వకారణమన్నారు. చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని అలవర్చుకుని తెలంగాణ స్వరాష్ట్ర కలను సాకారం చేశాం. కుల వృత్తులకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు.
Read also: Chandrababu Arrested Live Updates: చంద్రబాబు అరెస్టుపై కొనసాగుతున్న వాదనలు.. లైవ్ అప్‌డేట్స్
సిద్దిపేటలో రజకుల సౌకర్యార్థం అన్ని సౌకర్యాలతో ఆధునిక ధోబీ ఘాట్ ను నిర్మించినట్లు పేర్కొన్నారు. రజకులకు ఎంబీసీ కార్పొరేషన్ పెద్ద ఎత్తున రుణాలు, స్వయం ఉపాధి యూనిట్లు మంజూరు చేసిందని మంత్రులు గుర్తు చేశారు. అనంతరం జిల్లా పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులను మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఏడో విడత ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో మత్స్య పారిశ్రామిక సంఘం ఆధ్వర్యంలోని సిద్దిపేట చింతల్ చెరువులో మంత్రులిద్దరూ కలిసి 52 వేల చేప పిల్లలను విడుదల చేశారు. మంత్రుల వెంట ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ రోజాశర్మ, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కాగా, స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మత్స్యకారులకు గుర్తింపు కార్డులను మంత్రులు పంపిణీ చేయనున్నారు.
Cyber Crime: నటికి టోకరా.. సెకన్లలో లక్ష నొక్కేశారు