Bride Groom Died With Current Shock In Siddipet: అంగరంగ వైభవంగా రెండు రోజుల క్రితం పెళ్లి జరిగింది. బంధువులు, స్నేహితులతో ఆ ఇళ్లు కలకలలాడింది. ఆ వధువు కూడా ఎన్నో ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టింది. అయితే కరెంట్ షాక్ రూపంలో మృత్యువు ఆ కుటుంబాన్ని కన్నీటిలో ముంచేసింది. వధువు నుదిటి కుంకుమ చెరిపేసింది. ఆమె ఆశలను తుంచేసింది. రిసెప్షన్ రోజే వరుడు విద్యుత్ షాక్ తో మృతి చెందాడు.
Also Read: Viral Video: రైలులో మహిళ పర్సు కొట్టేసిన దొంగ.. చుక్కలు చూపించిన ప్రయాణికులు
వివరాల ప్రకారం సిద్దిపేట జిల్లాలోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన నిరంజన్ కు గత శనివారం ఘనంగా వివాహం జరిగింది. నిరంజన్ ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాలలో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడుగా పని చేస్తున్నాడు. మంచి ఉద్యోగం, జీతం, మంచి కుటుంబం దీనికి తోడు అందమైన అమ్మాయిని పెళ్లాడాడు నిరంజన్. ఇక అంతా సంతోషంగా పెళ్లి సంబరాలు చేసుకున్నారు. ఈరోజు రిసెప్షన్ పెట్టుకున్నారు. అందరూ ఈ కార్యక్రమానికి రెడీ అవుతుండగా అనుకోని సంఘటన జరిగింది. వరుడుకు కరెంట్ షాక్ తగిలింది. దీంతో వరుడిని వెంటనే ఆసుపత్రికి తీసుకు వెళ్లారు కుటుంబ సభ్యులు అయితే అప్పటికే నిరంజన్ మరణించాడు. దీంతో కుటుంబం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. పెళ్లి జరిగిన ఇంట్లో ఇలా జరగడం ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో ఆ గ్రామంలో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. పెళ్లి చేసుకొని ఆనందంగా ఉండాల్సిన తమ కొడుకు అందనంత దూరాలకు వెళ్లిపోవడంతో ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. ఇక పెళ్లి కూతరు ఆమె కుటుంబం కూడా ఈ ఘటనతో షాక్ గురయ్యారు. నూతన వధువు తన జీవితం ఇలా అయిపోవడంతో కన్నీరు మున్నీరవుతుంది. ఆమె బాధను మాటల్లో వర్ణించలేకపోతున్నారు.