ఐపీఎల్ 2025లో భాగంగా నేడు లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకానా క్రికెట్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఇరు జట్లలో హార్డ్ హిట్టర్లు ఉండడంతో మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది. ఈ సీజన్ మొదటి మ్యాచ్‌లో గెలిచిన పంజాబ్.. మరో విజయంపై కన్నేసింది. మరోవైపు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓ దాంట్లో ఓడి, మరోదాంట్లో విజయం సాధించిన లక్నో..…
ఐపీఎల్ 2025లో భాగంగా మంగళవారం నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సెంచరీ చేయకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మూడో స్థానంలో దిగిన శ్రేయస్.. ఫోర్లు, సిక్సులతో చెలరేగాడు. ఈ క్రమంలో 17 ఓవర్ పూర్తయ్యేసరికి 90 పరుగులకు చేరుకున్నాడు. అప్పటికి ఇంకా 3 ఓవర్లు ఉండడంతో.. శ్రేయస్ సెంచరీ లాంఛనమే అని అందరూ అనుకున్నారు. అయితే తర్వాతి 2 ఓవర్లలో 3 బంతులే ఆడి 7…
సీజన్ తొలి మ్యాచులోనే 97 పరుగులతో నాటౌట్‌గా నిలవడం తమకు మరింత కలిసొచ్చే అంశం అని పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. శశాంక్ సింగ్ అద్భుతంగా ఆడాడని, 16 బంతుల్లో 44 రన్స్ చేయడం జట్టుకు కీలకంగా మారాయన్నాడు. ఒత్తిడిలో కూడా విజయ్ కుమార్ వైశాక్ ప్రశాంతంగా బౌలింగ్ చేశాడని ప్రశంసించాడు. సీజన్ ప్రారంభానికి ముందే అన్ని విధాలుగా సిద్ధమయ్యామని, ఇదే జోరును మిగతా మ్యాచ్‌ల్లోనూ కొనసాగించాలనుకుంటున్నాం అని శ్రేయస్ చెప్పాడు. ఐపీఎల్ 2025లో…
ఐపీఎల్ 2025లో భాగంగా గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. ఈ క్రమంలో టాస్ ఓడిపోయి బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 243 పరుగులు చేసింది.
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సెంట్రల్ కాంట్రాక్టులకు సంబంధించిన జాబితా త్వరలో విడుదల కావాల్సి ఉంది. గత సంవత్సరం బీసీసీఐ ఆగ్రహానికి గురై సెంట్రల్ కాంట్రాక్టు కోల్పోయిన స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఈసారి పక్కాగా దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో అద్భుత బ్యాటింగ్‌తో భారత్ విజయాల్లో కీలక పాత్ర పోషించడమే ఇందుకు కారణం. సెలక్షన్ కమిటీ, ప్రధాన కోచ్‌తో సంప్రదింపుల తర్వాత బీసీసీఐ కార్యదర్శి దేవ్జిత్ సైకియా కాంట్రాక్టు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కప్ కొట్టని జట్లలో పంజాబ్ కింగ్స్ ఒకటి. 2008 నుంచి ఐపీఎల్ ఆడుతున్నా.. ఇప్పటివరకు టైటిల్ ముద్దాడలేదు. ఆరంభ సీజన్లో సెమీస్ చేరిన పంజాబ్.. 2014లో ఫైనల్ చేరి కోల్‌కతా చేతిలో ఓటమిపాలైంది. ఈ రెండు ప్రదర్శనలు మినహాయిస్తే.. మరోసారి కనీసం లీగ్ దశను కూడా దాటలేకపోయింది. ప్రాంచైజీ పేరు మార్చినా, వేర్వేరు కెప్టెన్లను ప్రయత్నించినా ఫలితం మాత్రం లేకపోయింది. ఇటీవలి సీజన్లలో పేలవ ప్రదర్శన కారణంగా.. సగటు అభిమానికి ప్లేఆఫ్స్…
ఛాంపియన్స్ ట్రోఫీ 2025ని టీమిండియా కైవసం చేసుకుంది. టీమిండియా తాజా గెలుపుతో మరో ట్రోఫీని ఖాతాలో వేసుకుంది. విజయనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. శ్రేయాస్ అయ్యర్‌ను సైలెంట్ హీరో అని వ్యాఖ్యానించాడు. 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజయంలో టీమిండియాకు సైలెంట్ హీరోగా నిలిచిన ఆటగాడిగా రోహిత్ శర్మ శ్రేయాస్ అయ్యర్‌ను సెలక్ట్ చేశాడు. అతని గురించి ఎక్కువ మాట్లాడ లేకపోయినా.. అతను తన పనిని పూర్తి అంకితభావంతో చేశాడని రోహిత్ శర్మ తెలిపాడు.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఘన విజయం సాధించింది. చివరి వరకు ఎంతో ఉత్కంఠ కొనసాగింది. 6 వికెట్ల నష్టానికి భారత్ 254 పరుగులు విజయ కేతనాన్ని ఎగురవేసింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025ని కైవసం చేసుకుంది. ఇప్పటికే రెండు ట్రోఫిలు సొంతం చేసుకున్న టీమిండియా తాజా గెలుపుతో మరో ట్రోఫీని ఖాతాలో వేసుకుంది.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా నేడు భారత్- న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు న్యూజిలాండ్‌కు 250 పరుగుల టార్గెట్ ను నిర్దేశించింది. టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. భారత్ తరఫున శ్రేయాస్ అయ్యర్ అత్యధికంగా 79 పరుగులు చేశాడు. అక్షర్ పటేల్ (42), హార్దిక్ పాండ్య (45)…
టీమిండియా వన్డే జట్టులో శ్రేయస్ అయ్యర్ కీలక ఆటగాడు అని, అతడిని తప్పించాలని ఎప్పుడూ అనుకోలేదని భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తెలిపాడు. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో రాణించిన యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌కు అవకాశం ఇవ్వాలని భావించామని చెప్పాడు. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో శ్రేయస్ 59 పరుగులు చేశాడు. కీలక సమయంలో క్రీజులోకి వచ్చి ధనాధన్ ఆటతో అలరించాడు. ఛేదనలో ఇన్నింగ్స్ ఆరంభంలోనే రెండు వికెట్స్ కోల్పోయిన దశలో వచ్చిన శ్రేయస్.. 36…