ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఐపీఎల్ 2025 క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ అద్భుత విజయం సాధించింది. వర్షం కారణంగా రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో ముందుగా ముంబై 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. ఛేదనలో పంజాబ్ మరో ఓవర్ మిగిలి ఉండగానే 5 వికెట్స్ కోల్పోయి 207 పరుగులు చేసి.. ఫైనల్స్‌లో అడుగుపెట్టింది. ఇక మంగళవారం జరిగే ఫైనల్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది.…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో మూడు వేర్వేరు జట్లను ఫైనల్‌కు తీసుకెళ్లిన ఏకైక కెప్టెన్‌గా నిలిచాడు. అహ్మదాబాద్‌లో ఆదివారం రాత్రి జరిగిన ఐపీఎల్ 2025 క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను పంజాబ్ కింగ్స్ చిత్తు చేసి ఫైనల్‌కు దూసుకెళ్లింది. దాంతో శ్రేయస్ ఖాతాలో ఈ అరుదైన ఘనత చేరింది. ఈ ఘనత దిగ్గజాలు ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ వల్ల కూడా కాలే. అయితే ఈ ఇద్దరు…
భారీ మ్యాచులంటే తనకు చాలా ఇష్టం అని పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. బ్యాటింగ్ చేసేటప్పుడు కామ్‌గా ఉండటం వెనుక కారణం ఏమీ లేదని చెప్పాడు. నిశ్శబ్దంగా కృషి చేస్తే ఫలితం అదే వస్తుందని తన జట్టు సహచరులకు ఎప్పుడూ చెబుతుంటా అని పేరొకొన్నాడు. క్వాలిఫయర్-1లో ఆర్సీబీ చేతిలో ఓడిపోయినప్పుడు నిరుత్సాహానికి గురైనప్పటికీ.. అదంతా అక్కడితోనే మరిచిపోయాం అని చెప్పుకొచ్చాడు. అహ్మదాబాద్‌లో ఆదివారం రాత్రి జరిగిన క్వాలిఫయర్-2లో ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసిన పంజాబ్..…
పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) ఐపీఎల్ 2025 ఫైనల్‌కు దూసుకెళ్లింది. అహ్మదాబాద్‌లో ఆదివారం రాత్రి జరిగిన క్వాలిఫయర్-2లో ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసిన పంజాబ్.. టైటిల్ పోరుకు సిద్ధమైంది. 204 పరుగుల భారీ లక్షాన్ని కేవలం 19 ఓవర్లలోనే ఐదు వికెట్స్ కోల్పోయి ఛేదించింది. పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (87; 41 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. శ్రేయస్ దాటికి ముంబై మరో టైటిల్ కల చెదిరింది. ఫైనల్‌కు వెళ్లడం పంజాబ్‌కు…
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)తో గురువారం జరిగిన తొలి క్వాలిఫయర్‌లో పంజాబ్ కింగ్స్ ఓటమిపై ఆ జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ స్పందించాడు. బ్యాటింగ్ వైఫల్యమే తమ ఓటమిని శాసించిందని, పిచ్ కండిషన్స్‌కు తగ్గట్లు ఆడటంలో బ్యాటర్లు విఫలమయ్యారన్నాడు. తాము తక్కువ స్కోర్ లక్ష్యంగా విధించామని, బౌలర్లను ఏమాత్రం నిందించలేం అని చెప్పాడు. మ్యాచ్ వైఫల్యంపై అధ్యయనం చేయాలన్నాడు. ఇది మర్చిపోలేని రోజు అని శ్రేయాస్ ఆవేదన వ్యక్తం చేశాడు. క్వాలిఫయర్‌లో ఆర్‌సీబీకి ఎక్కడా కూడా పంజాబ్…
Rohit Sharma: ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ అనంతరం ముంబై జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన ఫన్నీ మూమెంట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మ్యాచ్ ముగిశాక రోహిత్ శ్రేయాస్ అయ్యర్ నడకను అనుకరిస్తూ ఓ వీడియోలో కనిపించాడు. ఈ వీడియోను ముంబై ఇండియన్స్ తమ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయగా, నెటిజన్లు దానిని విపరీతంగా ట్రెండ్ చేస్తున్నారు. ఈ వీడియోను చూసిన రోహిత్…
Preity Zinta : ఈ సీజన్ ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ అదరగొడుతుంది. 11 మ్యాచుల్లో 7 గెలిచి 15 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. మెగా వేలానికి ముందు కేకేఆర్ విడుదల చేయడంతో పంజాబ్ కింగ్స్ యాజమాన్యం శ్రేయాస్ అయ్యర్ ని 26 కోట్ల భారీ ధరకు దక్కించుకుంది. ఓ వైపు బ్యాటర్ గా పరుగులు సాధిస్తూనే సారధిగా జట్టును సక్సెస్ ఫుల్ గా ముందుకు నడిపిస్తున్నాడు. అయ్యర్ ఇప్పటివరకు 11 మ్యాచులో 405 పరుగులతో…
ఐపీఎల్ 2025లో భారత స్పిన్నర్ దిగ్వేశ్ రాఠీ ఆకట్టుకుంటున్నాడు. ఐపీఎల్‌లో ఇదే తొలి సీజన్ అయినా.. దిగ్గజ బ్యాటర్లను సైతం తన స్పిన్ మయాజాలంతో కట్టడి చేస్తున్నాడు. పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు కీలక సమయాల్లో వికెట్లు పడగొడుతూ లక్నో సూపర్ జెయింట్స్‌కు అండగా నిలిస్తున్నాడు. ఇతను ఇప్పటివరకు 11 మ్యాచ్‌ల్లో 12 వికెట్లు పడగొట్టాడు. అయితే దిగ్వేశ్ తన బౌలింగ్ కన్నా.. సంబరాలతోనే ఎక్కువగా ఫేమస్ అయ్యాడు. ఐపీఎల్ 2025లో ఇప్పటివరకు రెండుసార్లు జరిమానా ఎదుర్కొన్న…
ఎట్టకేలకు పంజాబ్ కింగ్స్ గట్టెక్కింది. యుజ్వేంద్ర చహల్ 4 వికెట్లు, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 72 పరుగులతో రాణించడంతో పంజాబ్ మరో రెండు బంతులు మిగిలి ఉండగానే చెన్నైని ఓడించింది. ఈ విజయంతో పంజాబ్ ప్లేఆఫ్స్ ఆశలను సజీవం చేసుకుంది. అటు చెన్నై సూపర్ కింగ్స్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే కెప్టెన్‌గా, ఆటగాడిగా సక్సెస్ అయినప్పటికీ.. శ్రేయాస్‌పై బీసీసీఐ చర్యలు తీసుకుంది. స్లో ఓవర్ రేట్ కారణంగా ఇప్పటికే పంత్, గిల్ భారీగా నష్టపోయారు. తాజాగా…
CSK vs PBKS: నేడు చెన్నై లోని చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇక సొంత మైదానంలో పంజాబ్ కింగ్స్‌తో తలపడే చెన్నై సూపర్ కింగ్స్ గెలవాలని చూస్తుంది. రెగ్యులర్ కెప్టెన్ రితురాజ్ గైక్వాడ్ గాయం తర్వాత కూడా ఎంఎస్ ధోని నాయకత్వంలో చెన్నై ప్రదర్శన ఏమి మారలేదు. సీఎస్కే జట్టు ఏడు…