Team India Captain: ప్రపంచవ్యాప్తంగా అత్యంత శక్తివంతమైన క్రికెట్ పరిపాలనా సంస్థల్లో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఒకటి. భారత క్రికెట్‌ను పర్యవేక్షిస్తూ, జట్టును నిర్వహించే బాధ్యత బీసీసీఐకి ఉంది. దేశవాళీ క్రికెట్ నుంచి అంతర్జాతీయ స్థాయిలో భారత క్రికెట్‌ను మరింత అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇకపోతే గాయాలతో సతమతమైన శ్రేయస్ అయ్యర్, బీసీసీఐ ఆగ్రహానికి గురై భారత జట్టులో తన స్థానాన్ని కోల్పోయాడు. అంతేకాకుండా, సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించబడ్డాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో కోల్కతా నైట్ రైడర్స్‌ను విజేతగా నిలబెట్టినా కూడా, అతనికి అనుకున్నంత గుర్తింపు రాలేదు. అయితే, దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణించి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించిన అయ్యర్ చివరకు ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ముందు ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో చోటు దక్కించుకున్నాడు.
Read Also: Amit Shah: అఖిలేష్ యాదవ్ ప్రశ్నకు అమిత్ షా ఫన్నీ సమాధానం.. నవ్వులే నవ్వులు(వీడియో)
ప్రస్తుతం శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ ప్రదర్శనపై క్రికెట్ అభిమానులు, విశ్లేషకులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అతని బ్యాటింగ్ అద్భుతంగా ఉందని సోషల్ మీడియా వినియోగదారులు, అభిమానులు కొనియాడుతున్నారు. అయ్యర్ ఇదే జోరును కొనసాగిస్తే రోహిత్ శర్మ తర్వాత భారత జట్టు కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టే అవకాశముందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మూడు ఫార్మాట్లలోనూ టీమిండియాను నాయకత్వం వహించగల సత్తా శ్రేయస్ అయ్యర్‌కు ఉందని అభిప్రాయపడుతున్నారు. తాజాగా ఇదే విషయంపై సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ డేల్ స్టెయిన్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 2025 ఐపీఎల్ సీజన్‌లో తనదైన బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నుండి తన ఫామ్‌ను కొనసాగిస్తూ, ఐపీఎల్ 2025లో అదిరిపోయే ప్రదర్శన కనబరుస్తున్నాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 97 పరుగులతో అజేయంగా నిలిచిన అయ్యర్.. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లోనూ 52 నాటౌట్ తో సత్తా చాటాడు.