ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 మ్యాచ్ నంబర్-13లో నేడు లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పంజాబ్ కింగ్స్ (PBKS) మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో లక్నోపై పంజాబ్ కింగ్స్ సాలిడ్ విక్టరీ సాధించింది. నిర్ణీత 16.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది. ఈ మ్యా్చ్ లో టాస్ గెలిచిన పంజాబ్ బౌలింగ్ ఎంచుకుని లక్నోను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. పంజాబ్ కింగ్స్ పేసర్ల విజృంభణతో పవర్ ప్లేలోనే 3 కీలక వికెట్లు కోల్పోయింది. లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. భారీ ఛేదనలో పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్(61) దంచికొట్టాడ. సిక్సులు, ఫోర్లు బాది అర్థ శతకం సాధించాడు. అయ్యర్, నేహాల్‌లు ధాటిగా ఆడడంతో పంజాబ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
Also Read:KCR: కాంగ్రెస్ పాలనపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
మొదట బ్యాటింగ్ చేసిన లక్నో జట్టుకు ఆరంభంలోనే అర్ష్‌దీప్ సింగ్ షాకిచ్చాడు. తొలి ఓవర్ నాలుగో బంతికే మిచెల్ మార్ష్ వికెట్ కోల్పోయాడు. ఆ తర్వాత మార్క్రమ్ 28 పరుగులు చేసి నాల్గవ ఓవర్లో ఔటయ్యాడు. ఆ తర్వాతి ఓవర్లోనే మ్యాక్స్ వెల్ పంత్ ను అవుట్ చేశాడు. పంత్ కేవలం 2 పరుగులు మాత్రమే చేశాడు. తర్వాత పురాన్ కొన్ని మంచి షాట్లు ఆడి 44 పరుగులు చేసి చాహల్ బౌలింగ్ లో ఔటయ్యాడు. డేవిడ్ మిల్లర్ 16వ ఓవర్లో ఔటయ్యాడు. మిల్లర్ 19 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. బదోని 41 పరుగులు, సమద్ 27 పరుగులు చేశారు.