ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కప్ కొట్టని జట్లలో పంజాబ్ కింగ్స్ ఒకటి. 2008 నుంచి ఐపీఎల్ ఆడుతున్నా.. ఇప్పటివరకు టైటిల్ ముద్దాడలేదు. ఆరంభ సీజన్‌లో సెమీస్ చేరిన పంజాబ్.. 2014లో ఫైనల్ చేరి కోల్‌కతా చేతిలో ఓటమిపాలైంది. ఈ రెండు ప్రదర్శనలు మినహాయిస్తే.. మరోసారి కనీసం లీగ్ దశను కూడా దాటలేకపోయింది. ప్రాంచైజీ పేరు మార్చినా, వేర్వేరు కెప్టెన్లను ప్రయత్నించినా ఫలితం మాత్రం లేకపోయింది. ఇటీవలి సీజన్లలో పేలవ ప్రదర్శన కారణంగా.. సగటు అభిమానికి ప్లేఆఫ్స్…
ఛాంపియన్స్ ట్రోఫీ 2025ని టీమిండియా కైవసం చేసుకుంది. టీమిండియా తాజా గెలుపుతో మరో ట్రోఫీని ఖాతాలో వేసుకుంది. విజయనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. శ్రేయాస్ అయ్యర్‌ను సైలెంట్ హీరో అని వ్యాఖ్యానించాడు. 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజయంలో టీమిండియాకు సైలెంట్ హీరోగా నిలిచిన ఆటగాడిగా రోహిత్ శర్మ శ్రేయాస్ అయ్యర్‌ను సెలక్ట్ చేశాడు. అతని గురించి ఎక్కువ మాట్లాడ లేకపోయినా.. అతను తన పనిని పూర్తి అంకితభావంతో చేశాడని రోహిత్ శర్మ తెలిపాడు.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఘన విజయం సాధించింది. చివరి వరకు ఎంతో ఉత్కంఠ కొనసాగింది. 6 వికెట్ల నష్టానికి భారత్ 254 పరుగులు విజయ కేతనాన్ని ఎగురవేసింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025ని కైవసం చేసుకుంది. ఇప్పటికే రెండు ట్రోఫిలు సొంతం చేసుకున్న టీమిండియా తాజా గెలుపుతో మరో ట్రోఫీని ఖాతాలో వేసుకుంది.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా నేడు భారత్- న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు న్యూజిలాండ్‌కు 250 పరుగుల టార్గెట్ ను నిర్దేశించింది. టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. భారత్ తరఫున శ్రేయాస్ అయ్యర్ అత్యధికంగా 79 పరుగులు చేశాడు. అక్షర్ పటేల్ (42), హార్దిక్ పాండ్య (45)…
టీమిండియా వన్డే జట్టులో శ్రేయస్ అయ్యర్ కీలక ఆటగాడు అని, అతడిని తప్పించాలని ఎప్పుడూ అనుకోలేదని భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తెలిపాడు. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో రాణించిన యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌కు అవకాశం ఇవ్వాలని భావించామని చెప్పాడు. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో శ్రేయస్ 59 పరుగులు చేశాడు. కీలక సమయంలో క్రీజులోకి వచ్చి ధనాధన్ ఆటతో అలరించాడు. ఛేదనలో ఇన్నింగ్స్ ఆరంభంలోనే రెండు వికెట్స్ కోల్పోయిన దశలో వచ్చిన శ్రేయస్.. 36…
India vs England: భారత్, ఇంగ్లాండ్ మధ్య మూడు మ్యాచ్‌ల ODI సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్ ఈరోజు మధ్యాహ్నం 1:30 గంటలకు కటక్‌లోని బారాబతి స్టేడియంలో జరగనుంది. నాగ్‌పూర్‌లో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌ను 4 వికెట్ల తేడాతో గెలుచుకున్న తర్వాత, టీమిండియా ప్రస్తుతం మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. దీనితో కటక్‌లో జరిగే రెండో వన్డే మ్యాచ్ గెలిస్తే భారత్ సిరీస్‌ను గెలుచుకుంటుంది. ఇంగ్లాండ్‌తో జరిగే ఈ వన్డే మ్యాచ్‌లో…
రంజీ ట్రోఫీలో ముంబై జట్టు రోహిత్ శర్మ లేకుండానే బరిలోకి దిగనుంది. ఫిబ్రవరి 6న ఇంగ్లండ్‌తో ప్రారంభమయ్యే వన్డే సిరీస్ కోసం రోహిత్ భారత జట్టుతో చేరాడు. దీంతో గురువారం మేఘాలయాతో ప్రారంభమయ్యే రంజీ ట్రోఫీ గ్రూపు-ఎ మ్యాచ్‌లో ముంబై హిట్‌మ్యాన్ లేకుండానే ఆడనుంది. మరోవైపు ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు ఎంపికైన యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్ కూడా ముంబై తరఫున బరిలో దిగడం లేదు. వీరి స్థానాల్లో ఆంగ్‌క్రిష్ రఘువంశి, సూర్యాంష్ షెడ్గే, అథర్వ అంకోలేకర్‌లను…
హైబ్రిడ్ మోడల్లో పాకిస్థాన్ ఆతిథ్యమివ్వనున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి 15 మంది సభ్యులతో కూడిన జట్టును భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ప్రకటించింది. టీమ్ ఇండియా కెప్టెన్ పగ్గాలను రోహిత్ శర్మకే అప్పగిస్తూ.. బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఈ ముఖ్యమైన టోర్నమెంట్‌కు యువ బ్యాట్స్‌మెన్ శుభ్‌మాన్ గిల్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించారు. పవర్ ఫుల్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ తిరిగి అరగేట్రం చేశాడు. వెన్ను గాయంతో బాధపడుతున్న.. స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా…
పంజాబ్ కింగ్స్ తమ జట్టుకు కొత్త కెప్టెన్‌ను ఆదివారం ప్రకటించింది. ఐపీఎల్ 2025లో పంజాబ్ జట్టుకు కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్ వ్యవహరించనున్నాడు. తొలి మ్యాచ్‌కి కెప్టెన్సీ చేస్తే భారత క్రికెటర్‌గా చరిత్ర సృష్టించనున్నాడు. రెండు కంటే ఎక్కువ జట్లకు కెప్టెన్‌గా వ్యవహరించిన తొలి భారత కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్ నిలిచాడు.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీ కంటే ముందు భారత్ స్వదేశంలో ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడనుంది. ఇంగ్లండ్‌తో ఐదు టీ20లు, మూడు వన్డేలు టీమిండియా ఆడనుంది. ఈ రెండు సిరీస్‌లకు బీసీసీఐ సెలెక్టర్లు త్వరలోనే జట్లను ప్రకటించనున్నారు. ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసే జట్టునే.. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో ఆడించే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు సిరీస్‌లలో కొన్ని నెలలుగా భారత జట్టుకు దూరంగా…