ఐపీఎల్ 2025లో భాగంగా మంగళవారం కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) సంచలన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసి 111 పరుగులే చేసినా.. కోల్‌కతాను 95కే ఆలౌట్ చేసి 16 రన్స్ తేడాతో అద్భుత విజయాన్ని ఖాతాలో వేసుకుంది. పంజాబ్ విజయంలో టీమిండియా మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ కీలక పాత్ర పోషించాడు. చహల్ తన స్పిన్ మాయాజాలంతో కేవలం 28 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అద్భుతంగా…
కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తన హృదయ స్పందన చాలా పెరిగిందని పంజాబ్ కింగ్స్ కోచ్ రికీ పాంటింగ్ తెలిపాడు. తనకు ఇప్పుడు 50 ఏళ్లు అని, ఈ వయసులో ఇలాంటి ఉత్కంఠ మ్యాచ్‌లు చూడాల్సిన అవసరం లేదన్నాడు. ఈ మ్యాచ్‌లో యుజ్వేంద్ర చహల్ ప్రదర్శన చెప్పలేనిదని, అద్భుతంగా బౌలింగ్ చేశాడన్నాడు. ఐపీఎల్లో తాను ఎన్నో మ్యాచ్‌లకు కోచ్‌గా పనిచేశానని, ఈ విజయం మాత్రం ఉత్తమంగా మిగిలిపోతుందని పాంటింగ్ చెప్పుకొచ్చాడు. మంగళవారం కోల్‌కతాతో ఉత్కంఠగా జరిగిన…
గత సంవత్సరం బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా నుండి తొలగించబడి.. కెరీర్లో గడ్డుకాలాన్ని ఎదుర్కొన్న మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్‌కు ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. మార్చి 2025కి గాను ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డును శ్రేయాస్ గెలుచుకున్నాడు. ఈ విషయాన్ని ఐసీసీ మంగళవారం ప్రకటించింది. జాకబ్ డఫీ, రచిన్ రవీంద్రలను అధిగమించి మరీ శ్రేయాస్ ఈ అవార్డును సొంతం చేసుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో శ్రేయస్ 243 పరుగులు చేసి.. భారత్…
PBKS vs CSK: ఐపీఎల్ 2025లో నేడు పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ పంజాబ్ హోం గ్రౌండ్ మొహాలీలో జరుగుతోంది. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన చెన్నై జట్టు ఈసారి ఎలాగైనా గెలవాలనే కసితో మ్యాచ్ లో అడుగుపెడుతోంది. ఇకపోతే, చెన్నై సూపర్ కింగ్స్ అతిపెద్ద ఆందోళన మహేంద్ర సింగ్ ధోని. ఎంఎస్ ధోని ఫామ్‌లో…
IPL Records: 2008లో ప్రారంభమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన టీ20 లీగ్‌లలో ఒకటిగా పేరొందింది. ఐపీఎల్లో అనేక దిగ్గజ ఆటగాళ్లు తమ ప్రతిభను చూపించి అభిమానులను ఆకట్టుకున్నారు. ఇందులో ప్రతి సీజన్లో కొత్త రికార్డులు, కొత్త మైలురాళ్లు నమోదవుతుంటాయి. తాజాగా 2025 ఐపీఎల్ సీజన్లో పంజాబ్ కింగ్స్ కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఓ విశేషమైన రికార్డు సాధించాడు. ఈ సీజన్లో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో పంజాబ్ కింగ్స్ జట్టు…
Team India Captain: ప్రపంచవ్యాప్తంగా అత్యంత శక్తివంతమైన క్రికెట్ పరిపాలనా సంస్థల్లో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఒకటి. భారత క్రికెట్‌ను పర్యవేక్షిస్తూ, జట్టును నిర్వహించే బాధ్యత బీసీసీఐకి ఉంది. దేశవాళీ క్రికెట్ నుంచి అంతర్జాతీయ స్థాయిలో భారత క్రికెట్‌ను మరింత అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇకపోతే గాయాలతో సతమతమైన శ్రేయస్ అయ్యర్, బీసీసీఐ ఆగ్రహానికి గురై భారత జట్టులో తన స్థానాన్ని కోల్పోయాడు. అంతేకాకుండా, సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించబడ్డాడు. ఐపీఎల్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో అత్యధిక వరుస విజయాలు అందుకున్న రెండో కెప్టెన్‌గా రికార్డుల్లో నిలిచాడు. సారథిగా శ్రేయస్ వరుసగా 8 విజయాలు సాధించాడు. ఈ ఐపీఎల్ ఎడిషన్‌లో మంగళవారం లక్నో సూపర్ జెయింట్స్‌పై పంజాబ్ విజయం సాధించడంతో శ్రేయస్ ఈ రికార్డు అందుకున్నాడు. ఐపీఎల్ 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున సారథిగా ఆరు విజయాలు సాధించిన శ్రేయస్.. ఐపీఎల్ 2025లో పంజాబ్ తరఫున…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 మ్యాచ్ నంబర్-13లో నేడు లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పంజాబ్ కింగ్స్ (PBKS) మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో లక్నోపై పంజాబ్ కింగ్స్ సాలిడ్ విక్టరీ సాధించింది. నిర్ణీత 16.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది. ఈ మ్యా్చ్ లో టాస్ గెలిచిన పంజాబ్ బౌలింగ్ ఎంచుకుని లక్నోను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. పంజాబ్ కింగ్స్ పేసర్ల విజృంభణతో పవర్ ప్లేలోనే 3 కీలక…
ఐపీఎల్ 2025లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యా్చ్ లో టాస్ గెలిచిన పంజాబ్ బౌలింగ్ ఎంచుకుని లక్నోను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. బరిలోకి దిగిన లక్నోకు పంజాబ్ బౌలర్స్ చెమటలు పట్టించారు. పంజాబ్ కింగ్స్ పేసర్ల విజృంభణతో పవర్ ప్లేలోనే 3 కీలక వికెట్లు కోల్పోయింది. టాప్ ఆర్డర్ చేతులెత్తేయడంతో భారీ స్కోరుకు బ్రేకులు పడ్డాయి. లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7…
ఐపీఎల్ లో నేడు మరో రసవత్తర మ్యాచ్ కు అంతా రెడీ అయ్యింది. నేడు లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య కాసేపట్లో మ్యాచ్ ప్రారంభంకానుంది. లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకానా క్రికెట్ స్టేడియం వేదికగా ఇరుజట్లు తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్ లో భాగంగా టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. ముందుగా లక్నో బ్యాటింగ్ కు దిగనుంది. లక్నో, పంజాబ్ జట్లలో విధ్వంసకర బ్యాటర్లు ఉండడంతో ఈ…