PBKS vs CSK: ఐపీఎల్ 2025లో నేడు పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ పంజాబ్ హోం గ్రౌండ్ మొహాలీలో జరుగుతోంది. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన చెన్నై జట్టు ఈసారి ఎలాగైనా గెలవాలనే కసితో మ్యాచ్ లో అడుగుపెడుతోంది. ఇకపోతే, చెన్నై సూపర్ కింగ్స్ అతిపెద్ద ఆందోళన మహేంద్ర సింగ్ ధోని. ఎంఎస్ ధోని ఫామ్‌లో లేకపోవడే ఇందుకు కారణం. దీని కారణంగా చెన్నై జట్టులో సమతుల్యత లేదు. గత మ్యాచ్‌లో పంజాబ్ జట్టు కూడా ఆర్ ఆర్ పై ఏకంగా 50 పరుగుల తేడాతో ఓడింది. దీనితో, తిరిగి విన్నింగ్ ట్రాక్‌పైకి రావాలనుకుంటుంది. ఇక నేడు ఆడే ప్లేయింగ్ XI జట్లు ఇలా ఉన్నాయి.
Read Also: LSG Vs KKR: ఉత్కంఠ పోరులో విజయం సాధించిన లక్నో.. ఫలించని కేకేఆర్ బ్యాటర్ల విధ్వసం
పంజాబ్ కింగ్స్ XI (PBKS):
ప్రభ్‌సిమ్రన్ సింగ్ (వీకె), ప్రియాంష్ ఆర్యా, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), నేహల్ వాఢేరా, శశాంక్ సింగ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, మార్కో యాన్సెన్, యూజ్వేంద్ర చాహల్, అర్షదీప్ సింగ్, లోకి ఫర్గూసన్
పంజాబ్ ఇంపాక్ట్ ప్లేయర్స్:
సూర్యాంశ్ షెడ్గే, యశ్ ఠాకూర్, పర్విన్ దూబే, అజ్మతుల్లా ఒమర్‌జాయ్, విజయ్‌కుమార్ వైశాఖ్
చెన్నై సూపర్ కింగ్స్ XI (CSK):
రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), విజయ్ శంకర్, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వీకె), ఆర్ అశ్విన్, నూర్ అహ్మద్, ముకేష్ చౌధరి, మతీషా పథిరానా, ఖలీల్ అహ్మద్
చెన్నై ఇంపాక్ట్ ప్లేయర్స్:
శివం దూబే, రాహుల్ త్రిపాఠి, దీపక్ హూడా, అంషుల్ కంబోజ్, జేమీ ఓవర్టన్