18 ఏళ్లుగా లీగ్‌లో ఉన్నా ట్రోఫీని అందుకోని జట్లలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ), పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) ఉన్నాయి. భారీ అంచనాలతో లీగ్‌ను ఆరంభించడం, ఆపై ఉసూరుమనిపించడం మొన్నటివరకు ఆర్‌సీబీకి పరిపాటిగా మారింది. అయితే ఈసారి మాత్రం అద్భుత ఆటతో ఫైనల్‌కు దూసుకొచ్చింది. మూడుసార్లు చేజారిన కప్పును ఈసారి మాత్రం వదలొద్దనే పట్టుదలతో ఆర్‌సీబీ ఉంది. మరోవైపు 2014లో ఒక్కసారి మాత్రమే ఫైనల్ ఆడి రన్నరప్‌గా నిలిచిన పంజాబ్.. అనంతరం ప్లేఆఫ్స్‌కు కూడా చేరలేదు. ఈసారి శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో ఏకంగా ఫైనల్‌కు చేరింది. ఈ రెండు జట్లలో తొలి కప్పు కల ఎవరికి తీరుతుందో చూడాలి.
ఆర్సీబీకి మంచి ఓపెనింగ్ ఉంది. విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ మంచి శుభారంభాలు ఇచ్చారు. ప్లేఆఫ్స్‌లో సాల్ట్ ఎలా చెలరేగాడో మనం చూశాం. విరాట్ లీగ్ ఆసాంతం రాణించాడు. క్వాలిఫయర్ 1లో విఫమైనా ఫైనల్లో ఫైనల్లో రాణించాల్సిన అవసరం ఎంతో ఉంది. కెప్టెన్ రజత్ పాటీదార్ భారీ ఇన్నింగ్స్ ఆడి చాలా రోజులైంది. మయాంక్ అగర్వాల్ రాణించాల్సిన అసవరం ఉంది. రొమారియో షెఫర్డ్, జితేశ్ శర్మ , కృనాల్ పాండ్య మంచి ఇన్నింగ్స్‌లు ఆడుతుండడం సానుకూలాంశం. అయితే టీమ్ డేవిడ్ గాయపడడం కాస్త కలవరపెట్టే అంశం. అతను ఫైనల్‌కు అందుబాటులో ఉంటాడా లేదా అన్నది ఇంకా తెలియదు. డేవిడ్ స్థానంలో రెండు మ్యాచ్‌లు ఆడిన లివింగ్‌స్టన్ ఫామ్‌లో లేడు. బౌలింగ్‌లో జోష్ హేజిల్‌వుడ్ పెద్ద బలం. భువనేశ్వర్ కుమార్, యశ్ దయాళ్, కృనాల్ పాండ్య, సుయాశ్ శర్మలతో ఆర్‌సీబీ బౌలింగ్ బాగుంది.
బ్యాటింగ్‌లో పంజాబ్ కింగ్స్ మెరుగ్గా ఉంది. ప్రమాదకర ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్, ప్రియాంశ్ ఆర్యలు విరుచుకుపడుతున్నారు. జోష్ ఇంగ్లిస్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్‌కు వెన్నెముక. రెండో క్వాలిఫయర్‌లో శ్రేయాస్ ఆడిన ఇన్నింగ్స్ అద్భుతం. నేహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టాయినిస్‌లతో బ్యాటింగ్ బలంగా ఉంది. బౌలింగ్‌లో పంజాబ్‌కు అర్ష్‌దీప్ సింగ్ కీలకం. ప్లేఆఫ్స్‌లో నిరాశపరిచినప్పటికీ లీగ్ దశలో మంచి ఆరంభాలందించాడు. ఫైనల్లో కూడా జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. అజ్మతుల్లా, జేమీసన్‌లు పెద్దగా ప్రభావం చూపడం లేదు. చహల్ తన స్పిన్ మాయాజాలం చూపిస్తే ఆర్‌సీబీకి తిప్పలు తప్పవు. రెండు జట్లూ సమవుజ్జీలుగా ఉండడంతో హోరాహోరీ సమరం ఖాయం.
అహ్మదాబాద్‌లో సీజన్ ఆరంభం నుంచి భారీ స్కోర్లు నమోదయ్యాయి. రెండో క్వాలిఫయర్‌లో కూడా 200 ప్లస్ రన్స్ నమోదయ్యాయి. టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. గ్రూప్ దశలో బెంగళూరు, పంజాబ్ తలో మ్యాచ్ గెలిచాయి. క్వాలిఫయర్-1లో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. ఫైనల్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించవచ్చు. అయితే ఫైనల్‌కు రిజర్వ్ డే (జూన్ 4) ఉంది.
తుది జట్లు (అంచనా):
బెంగళూరు: విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, మయాంక్ అగర్వాల్, రజత్ పాటీదార్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జితేశ్ శర్మ, షెఫర్డ్, భువనేశ్వర్, కృనాల్ పాండ్య, యశ్ దయాళ్, జోష్ హాజల్‌వుడ్.
పంజాబ్: ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్, ఇన్‌గ్లిస్, శ్రేయస్ అయ్యర్ (కెపె్టన్), నేహల్ వధేరా, స్టొయినిస్, శశాంక్ సింగ్, అజ్మతుల్లా, చహల్, జేమీసన్, అర్ష్‌దీప్ సింగ్.