Preity Zinta : ఈ సీజన్ ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ అదరగొడుతుంది. 11 మ్యాచుల్లో 7 గెలిచి 15 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. మెగా వేలానికి ముందు కేకేఆర్ విడుదల చేయడంతో పంజాబ్ కింగ్స్ యాజమాన్యం శ్రేయాస్ అయ్యర్ ని 26 కోట్ల భారీ ధరకు దక్కించుకుంది. ఓ వైపు బ్యాటర్ గా పరుగులు సాధిస్తూనే సారధిగా జట్టును సక్సెస్ ఫుల్ గా ముందుకు నడిపిస్తున్నాడు. అయ్యర్ ఇప్పటివరకు 11 మ్యాచులో 405 పరుగులతో సత్తా చాటాడు. అందులో నాలుగు హాఫ్ సెంచరీలున్నాయి. అయితే గత సీజన్లో పేలవ ఫామ్ తో ఆర్సీబీకి దూరమైన గ్లేన్ మ్యాక్స్ వెల్ ఈ సీజన్లోనూ ప్లాప్ అయ్యాడు. గత సీజన్లో ఆర్సీబీ తరుపున 10 మ్యాచుల్లో 52 పరుగులు చేయగా… ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్ తరుపున 7 మ్యాచుల్లో 48 పరుగులు చేశాడు. దీంతో మ్యాక్స్ వెల్ ప్రదర్శనతో నెటిజన్లు మండిపడుతున్నారు. ఆస్ట్రేలియా జట్టుకు ఆడుతున్నప్పుడు అద్భుత ప్రదర్శన ఇస్తావ్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో చేతులెత్తేస్తావ్ అంటూ మండిపడుతున్నారు.
IPL 2025: ఆర్సీబీ ‘మంత్రం’.. టైటిల్ కోసమేనా..
ఇదే విషయంపై ఓ నెటిజన్ ప్రీతి జింటాను అసభ్యకరంగా ట్రోల్ చేశాడు. ప్రీతీ జింటా ఆస్క్ మీ ఎనీథింగ్ లో ఓ నెటిజన్… మేడమ్ మీరు మ్యాక్స్ వెల్ ను పెళ్లి చేసుకోవాల్సింది… తనను మీరు పెళ్లి చేసుకుని ఉంటే అద్భుతంగా ఆడేవాడేమో అంటూ ఓ నెటిజన్ అన్నాడు. దానికి ప్రీతి కూడా ఘాటుగా స్పందించింది. నీకు మైండ్ ఉందా.. నేను స్త్రీని కాబట్టే ఇలా ప్రవర్తిస్తున్నారు.. ఇది మహిళల పట్ల వివక్ష చూపించడమే కదా.. ఒక స్త్రీ కార్పొరేట్ స్థాయిలో నిలదొక్కుకోవడం ఎంత కష్టమో తెలుసా.. 18 ఏళ్లుగా పంజాబ్ ని ముందుండి నడిపిస్తున్నాను.. మాట్లాడేటప్పుడు కాస్త అలోచించి మాట్లాడాలి అంటూ సదరు నెటిజన్ కి చురకలంటించింది. కాగా ఈ విషయంలో ప్రీతి జింటాకి పెద్ద సంఖ్యలో మద్దతుగా నిలుస్తున్నారు.