Shivraj Singh Chouhan: ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచులో భారత్ ఆస్ట్రేలియాపై ఓడిపోవడం రాజకీయ అస్త్రంగా మారింది. దీనిపై కాంగ్రెస్, బీజేపీలు మాటల యుద్ధానికి తెరలేపాయి. ఇటీవల రాజస్థాన్ జలోర్‌లో జరిగిన ర్యాలీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోడీపై ‘పనౌటీ’(చెడుశకునం) అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీజేపీ ఘాటుగానే స్పందించింది. రాహుల్ గాంధీ మానసిక స్థితి సరిగా లేదంటూ బీజేపీ విమర్శించింది.
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తనకు కంచుకోటగా పేరుగాంచిన బుద్ని నుంచి పోటీ చేయనున్నట్టు సోమవారం విడుదల చేసిన బీజేపీ నాల్గవ అభ్యర్థుల జాబితా వెల్లడించింది.
Madhya Pradesh Rain: మధ్యప్రదేశ్‌లో నిరంతరంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో కురిసిన వానకు వరద పరిస్థితి తలెత్తింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని మాల్వా, నిమార్ ప్రాంతంలోని అనేక ప్రాంతాల్లో వరదలకు 8,700 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
అక్టోబర్ రెండో వారంలో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించే అవకాశం ఉంది. దీనికి ముందు బీజేపీ రాజకీయ సమీకరణాలపై కసరత్తు ప్రారంభించింది. అసంతృప్తులను శాంతింపజేసేందుకు పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఇప్పుడు పార్టీ ప్రాంతీయ, కుల సమీకరణాలకు అనుగుణంగా మంత్రివర్గాన్ని విస్తరించబోతోంది.
రిటైర్డ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ (ఐఏఎస్) అధికారి, మధ్యప్రదేశ్ తొలి మహిళా ప్రధాన కార్యదర్శి నిర్మలా బుచ్ వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో ఆదివారం ఇక్కడ మరణించారని కుటుంబ వర్గాలు తెలిపాయి.
మధ్యప్రదేశ్‌లో మూడు రోజుల తర్వాత 300 అడుగుల బోరుబావిలోంచి బయటకు తీసిన రెండేళ్ల బాలిక గురువారం ఆస్పత్రిలో మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. రాజధాని భోపాల్‌కు దాదాపు 40 కిలోమీటర్ల దూరంలోని సెహోర్‌లో ఈ ఘటన జరిగింది.
Hijab Controversy: రెండు రోజుల క్రితం హిజాబ్ వివాదం చెలరేగిన మధ్యప్రదేశ్‌లోని దామోహ్‌లోని గంగా జమున హయ్యర్ సెకండరీ స్కూల్ రిజిస్ట్రేషన్‌ను మధ్యప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేసింది.
మధ్యప్రదేశ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యులు బుధవారం నిరవధిక సమ్మె ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో తమ సహోద్యోగులకు సౌకర్యాలు కల్పించడం, బ్యూరోక్రాటిక్ జోక్యానికి ముగింపు పలకడం వంటి అనేక డిమాండ్లపై 13,000 మంది వైద్యులు సమ్మె చేస్తున్నారు.
Shivraj Singh Chouhan: ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన విమర్శలు వివాదాస్పదం అయ్యాయి. ప్రధాని మోడీని ‘విషసర్పం’తో పోల్చడంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇదిలా ఉంటే బీజేపీ నేత, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఖర్గేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీని శివుడి(నీలకంఠుడు)తో పోల్చారు. ప్రధాని దేశ ప్రజల కోసం విషాన్ని భరిస్తున్నారని అన్నారు. ప్రధాని సుసంపన్నమైన, శక్తివంతమైన భారతదేశాన్ని నిర్మిస్తున్నారని అన్నారు.