Nirmala Buch: రిటైర్డ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ (ఐఏఎస్) అధికారి, మధ్యప్రదేశ్ తొలి మహిళా ప్రధాన కార్యదర్శి నిర్మలా బుచ్ వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో ఆదివారం ఇక్కడ మరణించారని కుటుంబ వర్గాలు తెలిపాయి.1960 బ్యాచ్ అధికారి అయిన నిర్మలా బుచ్ తన 90 ఏళ్ల వయస్సులో కన్నుమూశారని తెలిసింది. ఆమె భర్త దివంగత ఎంఎన్ బుచ్ కూడా ప్రఖ్యాత ఐఏఎస్ అధికారి. ఆమెకు ఒక్కగానొక్క కొడుకు ఉన్నారని కుటుంబ వర్గాలు వెల్లడించాయి.
Also Read: Jammu Kashmir: ఆకస్మిక వరదల్లో కొట్టుకుపోయి ఇద్దరు సైనికులు మృతి
ఆమె మృతి పట్ల మధ్యప్రదేశ్ రాష్ట్ర ఐఏఎస్ సంఘం కార్యదర్శి వివేక్ పోర్‌వాల్ ఆమె మృతికి సంతాపం తెలిపారు. నిర్మలా బుచ్ సహకారాన్ని గుర్తు చేసుకుంటూ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆమె చిత్తశుద్ధి, పరిపాలనా దక్షత అద్భుతమని అన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ కమల్‌నాథ్ తన సంతాప సందేశంలో అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా ఆమె చేసిన సహకారంతో పాటు, సామాజిక కార్యకర్తగా బుచ్ పాత్ర ఎప్పటికీ మరువలేనిదని అన్నారు.
मध्यप्रदेश की पूर्व मुख्य सचिव श्रीमती निर्मला बुच जी के निधन के समाचार से मन दुःखी है। उनकी कर्तव्यनिष्ठा और प्रशासनिक दक्षता अद्भुत थी। मैं ईश्वर से दिवंगत आत्मा की शांति तथा शोकाकुल परिजनों को इस दुःख को सहन करने की शक्ति देने की प्रार्थना करता हूँ। दुःख की इस घड़ी में मेरी…
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) July 9, 2023