Madhya Pradesh: ఫలించని శ్రమ.. 300 అడుగుల లోతు బోరుబావిలో పడిన రెండేళ్ల చిన్నారి మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో మూడు రోజుల తర్వాత 300 అడుగుల బోరుబావిలోంచి బయటకు తీసిన రెండేళ్ల బాలిక గురువారం ఆస్పత్రిలో మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. రాజధాని భోపాల్‌కు దాదాపు 40 కిలోమీటర్ల దూరంలోని సెహోర్‌లో ఈ ఘటన జరిగింది. పోస్టుమార్టం కోసం తరలించిన చిన్నారి మృతదేహం బాగా కుళ్లిపోయిందని అధికారులు తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ముంగవలి గ్రామంలోని సృష్టి అనే బాలిక బోరుబావిలో పడింది. గురువారం సాయంత్రం 5.30 గంటలకు ఆమెను బయటకు తీసి, చికిత్స కోసం అంబులెన్స్‌లో జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు మరో అధికారి తెలిపారు.
ఆమె మొదట బోర్‌వెల్‌లో దాదాపు 40 అడుగుల లోతులో కూరుకుపోయిందని, అయితే రెస్క్యూ ఆపరేషన్‌లో నిమగ్నమైన యంత్రాల వల్ల కలిగే ప్రకంపనల కారణంగా ఆమె దాదాపు 100 అడుగుల లోతుకు జారిపోయిందని, దీంతో పని మరింత కష్టతరంగా మారిందని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బుధవారం తెలిపారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF), స్టేట్ డిజాస్టర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఫోర్స్ (SDERF)తో పాటు, సైన్యం, రోబోటిక్ నిపుణుల బృందం కూడా రెస్క్యూ ఈ ఆపరేషన్‌లో పాల్గొంది.
Also Read
- Delhi Protest: దీపావళి వరకు ఢిల్లీలో నిరసనలు వద్దు.. అమిత్ షాకు వ్యాపారుల లేఖ.!
- CJP protest: CJPకి ఢిల్లీ హైకోర్టులో ఊరట.. ‘తిరంగా’ నిరసనకు అనుమతి.!
- AP Seat Sharing Talks: సీట్ల పంచాయితీ కొలిక్కి..! టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య తిరుపతి టెన్షన్..
- Jasprit Bumrah: బుమ్రా లాంటి బౌలర్ మళ్లీ దొరకడు.. ప్రత్యామ్నాయం లేదు.. కానీ..!
Read Also: Bihar: వంతెన స్లాబ్, పిల్లర్ మధ్య చిక్కుకున్న బాలుడు.. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి
అసలేం జరిగిందంటే.. రెండేళ్ల చిన్నారి మంగళవారం ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తూ బోరుబావిలో పడింది. దీంతో చిన్నారిని క్షేమంగా బయటకు తీసేందుకు అధికారులు, రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. దాదాపు 50 గంటలపాటు సహాయక చర్యలు కొనసాగాయి. ఆ బాలికను బయటకు తీసి చికిత్స కోసం పంపించినా ఫలితం లేకపోయింది. చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. దీంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
తాజావార్తలు
-
Delhi Protest: దీపావళి వరకు ఢిల్లీలో నిరసనలు వద్దు.. అమిత్ షాకు వ్యాపారుల లేఖ.!
-
CJP protest: CJPకి ఢిల్లీ హైకోర్టులో ఊరట.. ‘తిరంగా’ నిరసనకు అనుమతి.!
-
రైతులకు దీపావళి గిఫ్ట్ .. PM Kisan 24వ విడత డేట్ ఫిక్స్?
-
AP Seat Sharing Talks: సీట్ల పంచాయితీ కొలిక్కి..! టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య తిరుపతి టెన్షన్..
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
ట్రెండింగ్
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..