మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ దేశంలో ఎవరూ వినడం లేదని విదేశాల్లో మాట్లాడుతున్నారని... అక్కడ చిన్నపిల్లాడిలా ఏడుస్తున్నారని శివరాజ్ సింగ్ చౌహాన్ ఎద్దేవా చేశారు.
Shivraj Singh Chouhan: రాహుల్ గాంధీ యూకే కేంబ్రిడ్జ్ వేదికగా భారత ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఇజ్రాయిలీ స్పైవేర్ పెగాసస్ ద్వారా తనతో పాటు పలువురు రాజకీయ నేతలపై నిఘా పెట్టారని రాహుల్ గాంధీ అన్నారు. దీనిపై బీజేపీ విరుచుకుపడుతోంది. తాజాగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, రాహుల్ గాంధీపై మండిపడ్డారు.
ఇంజినీర్లు, డాక్టరేట్ హోల్డర్లతో సహా 12 లక్షలకు పైగా అభ్యర్థులు మధ్యప్రదేశ్‌లో దాదాపు 6,000 పట్వారీ స్థానాలకు దరఖాస్తు చేసుకున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగం గురించి పలువురు ఆందోళన వ్యక్తం చేశారు.
సంక్రాతి పండుగ రోజు త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య తలెత్తడం వల్ల టేకాఫైన ప్రదేశానికే తిరిగి వచ్చి ల్యాండ్ అయ్యింది.
రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ముకు క్రాస్ ఓటింగ్ వేసిన తన మంత్రివర్గంలోని మంత్రులకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కృతజ్ఞతలు తెలిపారు. NDA అభ్యర్థి ద్రౌపది ముర్ము ఎన్నికల్లో విజయం సాధించి భారతదేశ తదుపరి రాష్ట్రపతి అవుతారని వెల్లడించారు. ముర్ము గెలుపును సంబరాలు చేసుకుంటూ, శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, “తమ మనస్సాక్షి మాటను విని, ద్రౌపది ముర్మును తదుపరి అధ్యక్షురాలిగా చేయాలని నిర్ణయించుకున్న ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. “గిరిజన…
మధ్యప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. సుమారు రెండు వేల కోట్ల రూపాయలతో ఆదిశంకరాచార్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. 108 అడుగుల విగ్రహం ఏర్పాటుతో పాటు అంతర్జాతీయ స్థాయి మ్యూజియాన్ని కూడా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి శివరాం సింగ్ చౌహన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అది శంకరాచార్య ఎక్తా న్యాస్ ట్రస్ట్ తో జరిగిన మీటింగ్ లో దీనిపై చర్చించారు. ఈ విగ్రహం, మ్యూజియం ఏర్పాటు ద్వారా ఆదిగురువైన ఆదిశంకరాచార్య గురించి ప్రపంచానికి…
ప్రజలను ఆకట్టుకోవడానికి రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు రకరకాల విన్యాసాలు చేస్తుంటారు.. కొన్ని సార్లు గొంతు సవరించాల్సి వస్తే.. మరికొన్ని సార్లు కాలు కదిపి స్టెప్పులు కూడా వేయాల్సి వస్తుంది… తాజాగా.. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారిపోయింది… సింగర్‌గా మారిపోయిన సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్… బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలేష్ విజయ్‌వర్గీయతో కలిసి పాటందుకున్నారు.. భోపాల్‌లోని అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ఇద్దరు దిగ్గజ నేతలు.. ప్రముఖ…