11 Year Old Minor Gangraped By 3 Member Near Famous Temple In Madhyra Pradesh: మధ్యప్రదేశ్‌లో అత్యంత హేయమైన ఘటన వెలుగు చూసింది. ఒక ప్రముఖ ఆలయం సమీపంలో 11 ఏళ్ల మైనర్ బాలికపై ముగ్గురు దుర్మార్గులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాదు.. ఒళ్లంతా రక్తం కారేలా రాక్షసుల్లా కొరికేశారు. ఆమెను దారుణంగా రేప్ చేసిన అనంతరం.. ఒక చోట పడేసి వెళ్లిపోయారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే రంగంలోకి దిగి, ఆ బాలికను ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఈ కేసులో పోలీసులు ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. వారిలో ఒకరు ఆలయ నిర్వహణ కమిటీ నిర్వహిస్తున్న గోశాలలో పనిచేస్తున్నాడు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ సీరియస్‌గా రియాక్ట్ అయ్యాడు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత మైనర్‌కు అత్యుత్తమ వైద్యం అందించాలని ఆదేశించారు.
సత్నా జిల్లా మైహర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అర్కండి టౌన్‌షిప్‌లో ప్రముఖ ఆలయానికి సమీపంలో ఉన్న అడవిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం ప్రకారం.. గురువారం సాయంత్రం నుంచి తమ అమ్మాయి కనిపించడం లేదని బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ బాలిక కోసం గాలించడం మొదలుపెట్టారు. అటు.. కుటుంబ సభ్యులు సైతం బాలిక కోసం వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం వారి ఇంటికి కొంత దూరంలోనే ఉన్న అడవి ప్రాంతంలో బాలిక ఆచూకీ లభ్యమైంది. ఈ అడవి.. దేశం నలుమూలల నుండి యాత్రికులను ఆకర్షిస్తున్న శారదా దేవి ఆలయానికి సమీపంలో ఉంది. రక్తమోడిన పరిస్థితిలో బాలిక కనిపించడంతో, వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. బాలిక పరిస్థితి గురించి గ్రామంలో వ్యాపించడంతో.. గ్రామస్థులు కోపాద్రిక్తులై ఆసుపత్రికి చేరుకున్నారు. ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టడంతో.. అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Delhi Student Case: ఢిల్లీ స్టూడెంట్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. చంపింది ఎవరో తెలుసా?
దీంతో పోలీసులు ఈ కేసుని సీరియస్‌గా తీసుకొని.. వెంటనే రంగంలోకి దిగి, నిందితుల్ని పట్టుకున్నారు. ఇద్దరు అనుమానుతుల్ని తాము అరెస్ట్ చేశామని, బాలికకి వైద్యు పరీక్షలు నిర్వహిస్తున్నారని మైహర్ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి లోకేష్ దబర్ పేర్కొన్నారు. ఈ ఘటనపై సీఎం శివరాజ్ సింగ్ ట్విటర్ మాధ్యమంగా ట్వీట్ చేశారు. ఈ అత్యాచార ఘటన విని తానెంతో బాధపడ్డానని, నేరస్తుల్ని అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. బాలికకు సరైన చికిత్స కోసం ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. నేరస్తుల్ని ఎవరైనా విడిచిపెట్టేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.