కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్‌లోని బుధని నియోజకవర్గం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో విదిషా నియోజకవర్గం నుంచి ఆయన ఎంపీగా విజయం సాధించారు.
Kishan Reddy : కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి సోమవారం జమ్మూకశ్మీర్ ఎన్నికల ఇంఛార్జిగా నియమితులయ్యారు. మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ తో పాటు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డా పార్టీ ఎన్నికల ఇంచార్జ్‌లు, కో – ఇన్‌చార్జ్ లను నియమించారు. మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ లలో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, జమ్మూ కాశ్మీర్‌లో సెప్టెంబర్ లోగా ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఎన్నికల…
మధ్య ప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ కు అత్యంత కీలక బాధ్యత దక్కే దక్కనున్నట్లు సమాచారం. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్థానంలో చౌహాన్‌ను నియమిస్తారనే ప్రచారం గత కొన్ని రోజులుగా జోరుగా సాగుతుంది.
Shivraj Singh Chouhan: లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ సమాయత్తం అవుతోంది. ఇప్పటికే 100 మందితో తొలి జాబితాను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ప్రతిపక్ష ఇండియా కూటమిలో సీట్ల షేరింగ్ కొలిక్కి రాకపోవడంతో, వారిపై మరింత ఒత్తిడి పెంచేందుకు బీజేపీ పక్కాగా పావులు కదుపుతోంది. ఇదిలా ఉంటే, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ని బీజేపీ లోక్‌సభ బరిలో నిలుపనున్నట్లు తెలుస్తోంది.
Shivraj Singh Chouhan: ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ మూడు రాష్ట్రాల్లో ఘన విజయం సాధించింది. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాలను కాంగ్రెస్ నుంచి గెలుచుకోగా.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ అధికారం నిలుపుకుంది. కేవలం తెలంగాణలో మాత్రమే కాంగ్రెస్ గెలుపొందింది. అయితే ఈ మూడు రాష్ట్రాల్లో కూడా బీజేపీ మాజీ సీఎంలను కాదని కొత్త ముఖాలను సీఎంలుగా ఎన్నుకుంది.
Madhya Pradesh: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి వచ్చి కొత్త ప్రభుత్వం కూడా ఏర్పడింది. ఈరోజు అంటే సోమవారం మధ్యప్రదేశ్ 16వ అసెంబ్లీ తొలి సెషన్ కూడా ప్రారంభం కానుంది.
Shivraj Singh Chouhan: నాలుగు పర్యాయాలు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన శివరాజ్ సింగ్ చౌహాన్ తన సీఎం పదవికి రాజీనామా చేశారు. ఎంపీ సీఎంగా బీజేపీ అధిష్టానం మోహన్ యాదవ్‌ని ప్రకటించడంతో శివరాజ్ సింగ్ పాలనకు తెరపడిండి. ఈ రోజు జరిగిన వీడ్కోలు సమావేశంలో పలువురు మహిళలు ఆయనకు కన్నీటీ వీడ్కోలు పలికారు.
BJP Set to choose Madhya Pradesh CM Today: మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జయకేతనం ఎగురవేసిన విషయం తెలిసిందే. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిగా సీనియర్ నాయకుడు విష్ణుదేవ్ సాయిని బీజేపీ ఆదివారం నియమించింది. రాజస్థాన్ సీఎం ఎవరనేది తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. ఇక మధ్యప్రదేశ్‌కు కొత్త సీఎం ఎవరో నేడు తెలిసిపోనుంది. ఇటీవల మధ్యప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 230 స్థానాలకు గానూ 163 సీట్లలో విజయం…
Kamal Nath: మధ్యప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ మరోసారి అధికారంలోకి వచ్చింది. గత 2 దశాబ్ధాలుగా ఆ రాష్ట్రంలో బీజేపీనే అధికారంలో కొనసాగుతోంది. మరో 5 ఏళ్లు కూడా బీజేపీ అధికారంలో కొనసాగబోతోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ అపూర్వ విజయం సాధించింది. 230 అసెంబ్లీ స్థానాలు ఉన్న మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఏకంగా 163 స్థానాల్లో గెలవగా.. కాంగ్రెస్ కేవలం 66 స్థానాలకే పరిమితమైంది.
Madhya Pradesh: సింగ్ ఈస్ కింగ్.. మరోసారి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో శివ"రాజ్"సింగ్ పాలనే కొనసాగుతుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఇండియా టుడే, ఇండియా టీవీ, రిపబ్లిక్ టీవీ వంటివి బీజేపీనే గెలుస్తుందని చెబుతున్నాయి. ఇదిలా ఉంటే మరికొన్ని సంస్థలు మాత్రం బీజేపీ కన్నా స్వల్పంగా కాంగ్రెస్ కొన్ని స్థానాలను సాధిస్తుందంటూ అంచనా వేస్తున్నాయి.