మహారాష్ట్రలో కొత్తగా సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఏక్ నాథ్ షిండే సంచలన నిర్ణయం తీసుకున్నారు. గతంలో తమిళనాడు సీఎం స్టాలిన్ తీసుకున్న తరహాలోనే తన కాన్వాయ్ కి ప్రత్యేక ప్రోటోకాల్ అవసరం లేదని ఆయన రాష్ట్ర పోలీసులకు ఆదేశాలిచ్చారు. వీఐపీల కన్నా సమాన్యుడికి ప్రాధాన్యత ఇవ్వాలని.. తన కాన్వాయ్ కోసం బందోబస్లు అవసరం లేదని మహారాష్ట్ర పోలీసులకు ఆదేశించారు. రాష్ట్ర డీజీపీ రజీనీష్ సేథ్, ముంబై పోలీస్ కమిషనర్ వివేక్ ఫన్సాల్కర్ తో చర్చించిన తర్వాత సీఎం…
మహారాష్ట్రలో రాజకీయ చదరంగం ఇంకా ముగిసిపోలేదు. ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి వరసగా ఎదురుదెబ్బలు తాకుతూనే ఉన్నాయి. ఉద్దవ్ ఠాక్రే నుంచి అధికారాన్ని హస్తగతం చేసుకున్న ఏక్ నాథ్ షిండే సీఎంగా పదవిని చేపట్టాడు. బీజేపీ, శివసేన రెబెల్ నేతలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే తాజాగా ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి భారీ ఎదురుదెబ్బ తాకింది. థానే మున్సిపల్ కార్పొరేషన్ లోని 67 మంది కార్పొరేటర్లలో 66 మంది ఏక్ నాథ్ షిండే వర్గానికి మద్దతు పలికారు.…
మహారాష్ట్ర రాజకీయాల్లో శివసేనలో తిరుగుబాటు సంచలనమే సృష్టించింది.. చివరకు సీఎం పదవికి ఉద్ధవ్ థాక్రే రాజీనామా చేశారు.. బీజేపీతో చేతులు కలిపిన శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండే.. ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు.. అయితే, పార్టీ నుంచి వెళ్లిపోయింది ఎమ్మెల్యేలే.. ప్రజలు కాదు.. ఇప్పటికిప్పుడు మహారాష్ట్రలో మధ్యంతర ఎన్నికలు జరిగినా.. శివసేనకు 100 సీట్లు వస్తాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆ పార్టీ నేత సంజయ్ రౌత్.. ఇక, ప్రస్తుతం ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వెంట ఉన్న…
ఉద్దవ్ థాక్రేపై శివసేన నేత ఏక్‌నాథ్ సిండే తిరుగుబాటు చేసిన తర్వాత మహారాష్ట్ర రాజకీయాల్లో ఎన్నో మలుపు, ట్విస్ట్లు, బిగ్ ట్విస్ట్లు.. ఇలా సాగుతూ పోయింది.. చివరకు.. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్ సిండేను ఎన్నుకోవడం, ప్రమాణం చేయడం.. ఫైనల్గా 286 మంది ఎమ్మెల్యేలున్న మహారాష్ట్ర అసెంబ్లీలో 164 ఎమ్మెల్యేల మద్దతుతో విశ్వాసపరీక్షలో కూడా ఏక్‌నాథ్ షిండే విజయం సాధించారు. అయితే, ఓ శివసేన ఎమ్మెల్యే చేసిన హడావిడి.. చివరకు ఇచ్చిన ట్విస్ట్తో.. ఉద్దవ్ థాక్రే, శివసేన శ్రేణులు…
రెబల్ ఎమ్మెలె్యేలపై హాట్ కామెంట్లు చేశారు సంజయ్ రౌత్.. జులై 11వ తేదీ వరకు రెబల్ ఎమ్మెల్యేలను గౌహతిలోనే ఉండమని ఆదేశాలు ఉన్నాయని పేర్కొన్నారు.. అంటే జులై 11 వరకు రెబల్ ఎమ్మెల్యేలకు మహారాష్ట్రలో పని లేదు అని సెటైర్లు వేశారు..
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం అగ్గిరాచుకుంటోంది. ఒకరినొకరు పోటాపోటీగా సమావేశాలకు ఏర్పటు చేస్తుకుంటున్నారు. శనివారం పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమాశానికి ఇటు శివసేన సుప్రీం, ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే పిలుపు నిచ్చిన విషయం తెలిసిందే. అయితే దీనికి పోటీగా శివసేన రెబల్ నేత ఏక్‌నాథ్ షిండే మద్దతుగా నిలిచిన తమ ఎమ్మెల్యేలతో సమావేశానికి పిలుపునిచ్చారు. దీంతో పోటాపోటీ సమావేశాలతో వాతావరణం ఒక్క సారిగా వేడెక్కింది. అయితే వర్చువల్ మీట్ లో ద్వారా సీఎం మాట్లాడనున్న విషయం తెలిసిందే. అయితే…