మహారాష్ట్రలో రాజకీయ చదరంగం ఇంకా ముగిసిపోలేదు. ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి వరసగా ఎదురుదెబ్బలు తాకుతూనే ఉన్నాయి. ఉద్దవ్ ఠాక్రే నుంచి అధికారాన్ని హస్తగతం చేసుకున్న ఏక్ నాథ్ షిండే సీఎంగా పదవిని చేపట్టాడు. బీజేపీ, శివసేన రెబెల్ నేతలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే తాజాగా ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి భారీ ఎదురుదెబ్బ తాకింది. థానే మున్సిపల్ కార్పొరేషన్ లోని 67 మంది కార్పొరేటర్లలో 66 మంది ఏక్ నాథ్ షిండే వర్గానికి మద్దతు పలికారు.
థానే మున్సిపల్ కార్పొరేషన్ శివసేనకు కంచుకోట లాంటిది. ముంబై తరువాత థానే మున్సిపల్ కార్పొరేషన్ అత్యంత కీలకమైనది. 131 మంది సభ్యుల థానే మున్సిపల్ కార్పొరేషన్ పదవీకాలం కొన్ని రోజుల క్రితం ముగిసింది. త్వరలోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మాజీ మేయర్ నరేష్ మాస్కే, సీఎం ఏక్ నాథ్ షిండేను నందనవన్ బంగ్లాలో కలిసి తన మద్దతు తెలియజేశాడు.
Read Also: Vikarabad: వీఆర్వో పాడుబుద్ధి.. భార్యకు పిల్లలు పుట్టడం లేదని..
గత నెలలలో ఏక్ నాథ్ షిండే, అప్పటి సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో విభేదించి 39 మంది శివసేన ఎమ్మెల్యేలతో గౌహతిలో క్యాంప్ ఏర్పాటు చేశాడు. ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన ఆధ్వర్యంలోని మహావికాస్ అఘాడీ ప్రభుత్వానికి రెబెల్ ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకున్నారు. ఈ నేపథ్యంలో ఎంవీఏ ప్రభుత్వం కుప్పకూలింది. దీంతో బీజేపీ సహాయంతో షిండే ముఖ్యమంత్రి అయ్యారు. బలనిరూపణ సమయంలో మరో ఇద్దరు శివసేన ఎమ్మెల్యేలు ఏక్ నాథ్ షిండే వర్గంలో చేరారు. ప్రస్తుతం శివసేన 18 మంది ఎంపీల్లో 12 మంది షిండే వర్గంలో చేరుతారని సమాచారం