EC allots the ‘Two Swords And Shield symbol’ to Eknath Shinde Shiv Sena: శివసేన పార్టీ రెండు వర్గాలుగా చీలిన సంగతి తెలిసిందే. మెజారిటీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏక్ నాథ్ షిండే వర్గంతోనే ఉన్నారు. అయితే ఉద్ధవ్ ఠాక్రే మాత్రం అసలైన శివసేన తమదే అంటోంది. ఈ వ్యవహారంపై ఇటీవల సుప్రీంకోర్టు, ఈ వ్యవహారంపై అంతిమ నిర్ణయం కేంద్ర ఎన్నికల సంఘానిదే అని చెప్పింది. నవంబర్ నెలలో అంధేరీ ఈస్ట్ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు రాబోతున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో శివసేన అసలైన గుర్తు ‘ ధనస్సు-బాణం’ని తమకే కేటాయించాలని ఇరు వర్గాలు పట్టుబట్టాయి. అయితే ఈ గుర్తును ఈసీ స్తంభింపచేసింది. దీంతో పాటు పార్టీ పేర్లను, ఎన్నికల గుర్తును సూచించాలని ఈసీ ఇరువర్గాలను కోరింది.
ఈ నేపథ్యంలో ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తన పార్టీ పేరు ‘శివసేన- ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే’ పేరును కేటాయించడంతో పాటు పార్టీ గుర్తుగా ‘కాగడా’ను కేటాయించింది. ఇదిలా ఉంటే ఏక్ నాథ్ షిండే వర్గం శివసేన పార్టీకి ‘ బాలాసాహెబంచి శివసేన’ పేరును కేటాయించడంతో పాటు తాజా ఆయన పార్టీ గుర్తుగా ‘ రెండు కత్తులు-డాలు’ గుర్తును కేటాయిస్తూ మంగళవారం ఈసీ నిర్ణయం తీసుకుంది. అంతకుముందు ఏక్ నాథ్ షిండే వర్గం తమకు రావిచెట్టు, కత్తి, సూర్యుడు గుర్తలలో ఏదో ఒకదానిని కేటాయించాలని ఈసీని కోరింది.
Read Also: India Assistance To Afghanistan: ఆఫ్ఘనిస్తాన్‌కు భారత్ సాయం.. వైద్యసాయం అందచేత
2004లోొ మహారాష్ట్రలో పార్టీగా గుర్తించబడిన ‘పీపుల్స్ డెమోక్రాటిక్ మూమెంట్’ గుర్తును పోలి ఉంది. నవంబర్ 3న జరగబోయే అంధేరి ఈస్ట్ ఎన్నికలను బీజేపీ-ఏక్ నాథ్ షిండేలు, అటు ఉద్ధవ్ ఠాక్రే వర్గాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో గెలిచి సత్తా చాటాలని ఇరు వర్గాలు కోరుకుంటున్నాయి.
శివసేన పార్టీలో చెలరేగిన అసమ్మతి పార్టీని రెండు ముక్కలు చేసిన విషయం తెలిసిందే. ఉద్ధవ్ ఠాక్రే సీఎంగా ఉన్న సమయంలో మహావికాస్ అఘాడీ కూటమిలోని ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు శివసేన శాసనసభ్యులకు, మంత్రులకు కనీస గౌరవం ఇవ్వడం లేదని..తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని ఏక్ నాథ్ షిండే క్యాంప్ రాజకీయానికి తెర లేపారు. గౌహతి కేంద్రంగా మెజారిటీ ఎమ్మెల్యేలు క్యాంపులో ఉన్నారు. తరువాత పరిణామాల్లో బీజేపీ పార్టీతో కలిసి ఏక్ నాథ్ షిండే సీఎంగా, బీజేపీ నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా సర్కార్ ఏర్పడింది.