Maharastra Politics: శివసేనలో తగదాలతో ఆ పార్టీ గుర్తు అయిన ‘ధనస్సు-బాణం’ కేంద్ర ఎన్నికల సంఘం స్తంభింపచేసింది. మహారాష్ట్రలో శివసేన చీలిక వర్గాలు శివసేన ధనస్సు-బాణం గుర్తు కోసం న్యాయపరమైన పోరాటం చేస్తున్నాయి. ఇప్పటికే అసలైన శివసేన ఎవరికి చెందుతుందో అనే విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘమే తేలుస్తుందని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఇదిలా ఉంటే నవంబర్ లో అంధేరీ ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నికల వస్తుండటంతో ఈ రెండు గ్రూపుల మధ్య గుర్తుల కోసం పంచాయతీ మొదలైంది.
శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి ‘కాగడా’గుర్తును కేటాయించింది ఈసీ. ‘శివసేన- ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే’ పేరును కేటాయించింది. ఇదిలా ఉంటే ‘ బాలాసాహెబంచి శివసేన’పేరును షిండే వర్గానికి కేటాయించింది ఈసీ. ఏక్ నాథ్ షిండే వర్గానికి గుర్తును కేటాయించాల్సి ఉంది. కొత్త ఎన్నికల గుర్తును ఎంచుకోవాలని ఇరువర్గాలకు సూచించింది ఈసీ. ముందుగా ఇరు వర్గాలు కూడా ‘త్రిశూలం’, ‘గద’ గుర్తులను కేటాయించాలని ఈసీని కోరాయి. అయితే ఈ రెండు కూడా ఓ మతాన్ని సూచించే విధంగా ఉండటంతో ఈ గుర్తులను ఇవ్వడానికి ఈసీ నిరాకరించింది. చివరగా శివసేన ఉద్దవ్ ఠాక్రే వర్గానికి ‘ కాగడా’ గుర్తును కేటాయిస్తూ ప్రకటన విడుదల చేసింది.
Read Also: IND Vs SA: నిర్ణయాత్మక వన్డే.. ప్రారంభంలోనే మూడు వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా
ఇదిలా ఉంటే సీఎం ఏక్ నాథ్ షిండే వర్గం మంగళవారం మూడు గుర్తులను ఎన్నికల సంఘానికి సమర్పించింది. రావిచెట్టు, కత్తి, సూర్యుడు గుర్తులను సూచించింది. ఈ మూడింటిలో ఏదో గుర్తును ఈసీ కేటాయించనుంది. ఇదిలా ఉంటే నవంబర్ 3 అంధేరి ఈస్ట్ అసెంబ్లీ ఉపఎన్నికల కోసం శివసేన పార్టీకి చెందిన విల్లు-బాణం గుర్తులను కేటాయించాలని ఇటు సీఎం ఏక్ నాథ్ షిండే, అటు ఉద్ధవ్ ఠాక్రే వర్గాలు కోరాయి. దీంతో ఈసీ ఈ గుర్తును స్తంభింపచేసింది.