Raj Thackeray: 13 సంవత్సరాలలో మొదటిసారిగా, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) చీఫ్ రాజ్ థాకరే ముంబైలో ఉద్ధవ్ ఠాక్రే నివాసం అయిన మాతోశ్రీకి వెళ్లారు. శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే పుట్టినరోజును సందర్భంగా శుభాకాంక్షలు చెప్పడానికి ఆయన ఇంటికి వెళ్లారు. రాజ్ ఠాక్రే చివరిసారిగా 2012లో బాలాసాహెబ్ ఠాక్రే మరణించిన సమయంలో మాతోశ్రీలోకి ప్రవేశించారు.
Shiv Sena MLA: ముంబైలో హాస్టల్ క్యాంటీన్లో నాసిరకం భోజనం పెట్టారని శివసేన (షిండే) ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ క్యాంటిన్ సిబ్బందిపై దాడి చేయడం తీవ్ర కలకలం రేపింది. ఈ వివాదం సద్దుమణగక ముందే ఇవాళ (గురువారం) దక్షిణ భారతీయులను లక్ష్యంగా చేసుకుని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారాయన.
Raj Thackeray: 20 ఏళ్లుగా శత్రువుగా ఉన్న బంధవులు ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రేలు ఒకే వేదికను పంచుకుంటూ, తాము కలిసిపోయినట్లు ప్రకటించారు. శివసేన(యూబీటీ), మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎంఎన్ఎస్) అధ్యక్షుల కలయిక రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. బాల్ ఠాక్రే కూడా చేయలేని పనిని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చేశారని రాజ్ ఠాక్రే అన్నారు. వివాదాస్పద త్రిభాష సూత్రంపై వ్యతిరేకత వ్యక్తం చేస్తూ,
Uddhav Thackeray: శివసేన (యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే శనివారం తన విడిపోయిన బంధువు, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్‌ఠాక్రేతో 20 ఏళ్ల తర్వాత మొదటిసారిగా వేదిక పంచుకున్నారు. ఉప్పునిప్పులా ఉండే వీరిద్దరు తమ విభేదాలను పక్కన పెట్టి కలిశారు. ‘‘మేము కలిసి వచ్చాము, కలిసి ఉంటాము’’ అంటూ ఉద్ధవ్ ఠాక్రే అన్నారు.
Raj Thackeray: భారతీయ జనతా పార్టీపై మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) చీఫ్ రాజ్‌ఠాక్రే హాట్ కామెంట్స్ చేశారు. మహారాష్ట్ర రాజకీయాల్లో పవార్, ఠాక్రే బ్రాండ్లను అంతం చేసేందుకు కమలం పార్టీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
టర్కీపై భారతీయుల బాయ్‌కట్ ఉద్యమం కొనసాగుతోంది. ఇప్పటికే టర్కీ ఉత్పత్తులను.. పర్యాటకరంగాన్ని నిషేధించారు. ఇలా ఒక్కొక్కటిగా టర్కీకి సంబంధించిన వాటిపై నిషేధం కొనసాగుతోంది.
Maharashtra: జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ) అమలు, హిందీ వివాదంపై తమిళనాడు, కర్ణాటక తర్వాత మహారాష్ట్రలోని పొలిటికల్ పార్టీలు కూడా ఈ వివాదంలో చేరాయి. మహారాష్ట్రంలో హిందీ వివాదం నేపథ్యంలో ఠాక్రే కుటుంబాల మధ్య సయోధ్య కుదిరే అవకాశం కనిపిస్తోంది. ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రేల మళ్లీ కలిసిపోయేందుకు మార్గం సుగమం అయింది. మరాఠీ గుర్తింపు, సంస్కృతికి ముప్పు ఉందనే ఆందోళనల మధ్య విడిపోయిన ఇద్దరు నేతలు నుంచి కీలక వ్యాఖ్యలు వచ్చాయి.
Shiv Sena MP: శివసేన ఎంపీ మానే చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తన పార్టీ అధినేత, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండేని పొగుడుతూ ఆయన ‘‘ప్రజల సీఎం’’ అని అన్నారు. ఏక్ నాథ్ షిండే రికార్డుల్లో ఉపముఖ్యమంత్రి కావచ్చు, కానీ ఆయన ప్రజల ముఖ్యమంత్రి అని శివసేన ఎంపీ ధైర్యశీల్ మానే శనివారం అన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి అఖండ విజయం సాధించిన తర్వాత, సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ పదవీ చేపట్టిని…
Disha Salian: సెలబ్రిటీ మేనేజర్ దిశా సాలియన్ మరణం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఐదేళ్ల క్రితం జూన్ 8, 2020న ముంబైలోని మలాడ్ ప్రాంతంలోని ఒక భవనం 14వ అంతస్తు నుంచి పడి మరణించింది. ప్రారంభంలో, దీనిని పోలీసులు యాక్సిడెంటల్ డెత్ రిపోర్ట్(ఏడీఆర్)గా నమోదు చేశారు. ఈ మరణం చుట్టూ అనేక వివాదాలు నెలకొని ఉన్నాయి. దిశా సాలియన్ బాలీవుడ్లో అనేక మందికి మేనేజర్‌గా పనిచేశారు. ఇందులో దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కూడా ఉన్నారు.