రెబల్ ఎమ్మెల్యేలు కోరితే రాజీనామా చేసేందుకు సిద్ధమని.. నా రాజీనామా లేఖ సిద్ధంగా ఉందని తెలిపారు ఉద్దవ్ థాక్రే.. రాజకీయ సంక్షోభంలో ఒకవేళ ప్రభుత్వం పడిపోయినా ఎన్నికలకు వెళ్లి మళ్లీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు ఉద్దవ్..
మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల కూటమి -మహా వికాస్ అఘాడీ సర్కార్ చిక్కుల్లో పడింది. శివసేనకు చెందిన మంత్రి ఏక్నాథ్ షిండే 22 మంది ఎమ్మెల్యేలతో అజ్ఞానతంలోకి వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. గుజరాత్‌లోని సూరత్‌లో గల ఒక హోటల్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఏక్నాథ్ షిండేతో పాటు కొందరు ఎమ్మెల్యేలు తమకు అందుబాటులోకి రావడం లేదని శివసేన నేతలు కూడా అంగీకరిస్తున్నారు. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్…
మరోసారి మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి.. ఓ మంత్రి సహా దాదాపు 15 మంది ఎమ్మెల్యేలు అజ్ఞాతంలోకి వెళ్లడం అధికార పార్టీకి షాక్ తగిలినట్టు కాగా.. సీఎం ఉద్ధవ్ ఠాక్కే అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు
అందరిలో ఆసక్తి కలిగించే విషయాలు నాలుగు ప్రధానాంశాల చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి. అవి సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంకేతిక అంశాలని క్రీస్తు పూర్వం నుంచీ ఎందరో తాత్వికులు ప్రతిపాదించారు. నవీనయుగం ఆ నాలుగు అంశాలనూ “Political, Economical, Social and Technological” అంటూ పేర్చి, ముద్దుగా ‘PEST’ అని పెట్టుకుంది. ఈ నాలుగు అంశాల నుంచి తప్పించుకొనే ప్రధాన అంశాలేవీ ఉండవు. ప్రస్తుతం బాలీవుడ్ సూపర్ స్టార్ తనయుడు ఆర్యన్ ‘డ్రగ్స్’ కేసు నుండి ‘క్లీన్ చిట్’తో…
పెట్రో ధరలు మంట మండుతున్నాయి.. ఐదు రాష్ట్రాల ఎన్నికల సమయంలో పెట్రో ధరలకు బ్రేక్ పడినా.. ఆ తర్వాత 16 రోజుల పాటు పెట్రోల్, డీజిల్ ధరలను వడ్డిస్తూ వచ్చాయి చమురు సంస్థలు.. దీంతో.. పెట్రోల్ కొట్టించాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి.. డీజిల్ పోయించాలంటే.. లెక్కలు వేయించుకోవాల్సిన దుస్థితి వచ్చింది.. అయితే, ఓ పెట్రోల్ బంక్ యజమానికి నచ్చిన నేత పుట్టిన రోజు రావడంతో.. స్థానికులకు బంపరాఫర్ ఇచ్చాడు.. రూపాయికే లీటర్ పెట్రోల్ అందించాడు.. అయితే, దానికి వెనుక…
ప్రధాని నరేంద్ర మోడీని గద్దె దింపడమే టార్గెట్‌గా మరో ఫ్రంట్ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి.. బీజేపీ, కాంగ్రెసేతర ఫ్రంట్ ఏర్పాటుకోసం కొన్ని రాష్ట్రాల సీఎంలు ప్రయత్నాలు చేస్తున్నారు.. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తెలంగాణ సీఎం కేసీఆర్, తమిళనాడు సీఎం స్టాలిన్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే.. ఇలా అంతా ఏకతాటిపైకి వస్తున్నారు.. ఈ నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు శివసేన ఎంపీ సంజయ్ రౌత్. కాంగ్రెస్ లేకుండా ఎలాంటి పొలిటికల్ ఫ్రంట్ సాధ్యం కాదని…
మహారాష్ట్ర రాజకీయాల్లో త్వరలోనే కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇటీవల ఆ రాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే ఆయన యూటర్న్ తీసుకోబోతున్నారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ప్రస్తుతం శివసేన పార్టీ కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే వచ్చే పార్లమెంట్ ఎన్నికల నాటికి ఈ సమీకరణాలు మరోసారి మారుతాయనే ప్రచారం జోరందుకుంది. ఇందుకు తగ్గట్టుగానే ఉద్దవ్ థాక్రే వ్యాఖ్యలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.…
కేంద్ర కేబినెట్ విస్తరణపై ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతున్నా.. చివరకు ముహూర్తం పెట్టేశారు.. రేపు సాయంత్రం కొత్త కేబినెట్ కొలువు తీరనుంది.. కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో 20 మందికి పైగా కొత్తవారికి అవకాశం ఇవ్వనున్నారని తెలుస్తోంది.. ఇదే సమయంలో.. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత దూరమైన బీజేపీ-శివసేన మళ్లీ ఒక్కటి కానున్నాయనే ప్రచారం ఊపందుకుంది… అందులో భాగంగా శివసేన కేంద్ర కేబినెట్లోనూ చేరుతుందనే గుసగుసలు వినిపించాయి.. అయితే, ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చారు శివసేన చీఫ్, మహారాష్ట్ర…
మహారాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు ఎలా మారతాయో ఎవరూ చెప్పలేని పరిస్థితి. రాజకీయాల్లో ఎవరికి ఎవరూ శతృవులు కాదు, ఎవరూ శాశ్వత మిత్రులూ కాదు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎన్నికల్లో ఫైట్ చేసిన శివసేన పార్టీ అధికారం కోసం బీజేపీతో తెగతెంపులు చేసుకొని కాంగ్రెస్ పార్టీతో జతకట్టింది. ఇది ఎవరూ ఊహించని పరిణామం. బీజేపీకి వ్యతిరేకంగా శివసేన బయటకురావడంతో మరోమాట మాట్లాడకుండా ఉద్ధవ్‌కు జైకొట్టింది కాంగ్రెస్. అయితే, గత కొన్ని రోజులుగా మహా అఘాడి వికాస్‌లో భాగస్వామ్యంగా ఉన్న ఎస్సీపీ…