టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నేడు ( గురువారం ) మహారాష్ట్రకు వెళ్తున్నారు. ఆయన కొల్హాపూర్ లోని శ్రీ మహాలక్ష్మీ ఆలయాన్ని సందర్శించి అక్కడ.. ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం షిర్డికి చేరుకోనున్నారు. షిర్డీలో సాయిబాబా దేవాలయాన్ని దర్శి్స్తారని టీడీపీ పార్టీ వర్గాలు తెలిపాయి.
యూపీఏ ప్రభుత్వ హయాంలో వ్యవసాయ శాఖను నిర్వహించిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) వ్యవస్థాపకుడు శరద్ పవార్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలలో.. మహారాష్ట్రకు చెందిన కొంతమంది రైతుల పేరుతో రాజకీయాలు చేశారని ప్రధాని నరేంద్ర మోడీ గురువారం అన్నారు.
మహారాష్ట్రలోని షిర్డీలో శ్రీ సాయిబాబా సమాధి ఆలయంలో ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ రమేష్ బాయిస్, ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొన్నారు. ప్రధాన మంత్రి ఆలయం వద్ద కొత్త దర్శన క్యూ కాంప్లెక్స్‌ను ప్రారంభించారు.
Shirdi Tour: షిర్డీ వెళ్లే యాత్రికులకు తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ శుభవార్త అందించింది. షిర్డీ వెళ్లాలనుకునే భక్తుల కోసం తెలంగాణ టూరిజం శాఖ రెండు ప్రత్యేక ప్యాకేజీలను తీసుకొచ్చింది.
నాసిక్-షిర్డీ హైవేపై బస్సు ఢీకొన్న ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా 10 మంది మృతి చెందగా, 34 మందికి పైగా గాయపడ్డారు. మహారాష్ట్రలో యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సు శుక్రవారం ట్రక్కును ఢీకొట్టింది. పతారే గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఒమిక్రాన్ మన దేశంలోనూ పలు రాష్ట్రాలకు వ్యాపిస్తోంది. ప్రధానంగా దేశ రాజధాని ఢిల్లీ, మహారాష్ట్రలో ఒమిక్రాన్ కేసులు పెద్దసంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రం షిర్డీ సాయిబాబా ఆలయంపై ఒమిక్రాన్ ప్రభావం పడింది. మహారాష్ట్రలో నైట్ కర్ఫ్యూ విధించడంతో అధికారులు ఆలయ వేళల్లోనూ మార్పులు చేశారు. షిర్డీ సాయిబాబా ఆలయాన్ని రాత్రి వేళ మూసివేస్తున్నట్టు షిర్డీసాయి సంస్థాన్ ఒక ప్రకటనలో తెలిపింది. Read Also: 2021: రివైండ్ – ప్రభావం…
ఈరోజు నుంచి షిర్డీ సాయిబాబా ఆలయం తెరుచుకోబోతున్నది. కరోనా కారణంగా ఏప్రిల్ 5 వ తేదీన ఆలయాన్ని మూసివేశారు. కరోనా ప్రస్తుతం తగ్గుముఖం పడుతుండటంతో తిరిగి ఆలయాన్ని తెరుస్తున్నారు. ప్రతిరోజూ 15 వేల మంది భక్తులకు మాత్రమే ప్రవేశం ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ దర్శనం చేసుకునేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 65 ఏళ్లు దాటినవారు, గర్భిణిలు, పదేళ్లలోపు చిన్నారులకు అనుమతులు లేవని అధికారులు పేర్కొన్నారు. అదేవిధంగా పూర్తిస్థాయి కరోనా వ్యాక్సిన్ తీసుకొని ఉండాలని,…
మహారాష్ట్రలో కరోనా విజృంభణ కొనసాగుతోన్న సమయంలో.. ఆ రాష్ట్రంలోని ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వం కఠిన ఆంక్షలను విధించింది.. అందులో భాగంగా మహారాష్ట్రలోని ప్రఖ్యాత షిర్డీ సాయిబాబా ఆలయాన్ని కూడా మూసివేశారు.. తర్వాతి ఉత్తర్వులు వెలువడేంతవరకూ ఆలయాన్ని మూసే ఉంచనున్నట్లు శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ అధికారులు ఏప్రిల్ 5వ తేదీన ప్రకటించారు.. అయితే, కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో.. మళ్లీ వరుసగా ఆలయాలు తెరుచుకుంటున్నాయి.. ఈ నేపథ్యంలో.. షిర్డీ సాయినాథుని ఆలయాన్ని తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది.. అక్టోబర్…