ఈరోజు నుంచి షిర్డీ సాయిబాబా ఆలయం తెరుచుకోబోతున్నది. కరోనా కారణంగా ఏప్రిల్ 5 వ తేదీన ఆలయాన్ని మూసివేశారు. కరోనా ప్రస్తుతం తగ్గుముఖం పడుతుండటంతో తిరిగి ఆలయాన్ని తెరుస్తున్నారు. ప్రతిరోజూ 15 వేల మంది భక్తులకు మాత్రమే ప్రవేశం ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ దర్శనం చేసుకునేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 65 ఏళ్లు దాటినవారు, గర్భిణిలు, పదేళ్లలోపు చిన్నారులకు అనుమతులు లేవని అధికారులు పేర్కొన్నారు. అదేవిధంగా పూర్తిస్థాయి కరోనా వ్యాక్సిన్ తీసుకొని ఉండాలని, లేదంటే 72 గంటల్లోగా కరోనా టెస్టులు చేయించుకొని నెగెటివ్ సర్టిఫికెట్ ఉండాలని అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్ 5 తరువాత షిరిడీ ఆలయం తెరుచుకోవడంతో భక్తులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.