ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు పూర్తైన నేపథ్యంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నేడు ( గురువారం ) మహారాష్ట్రకు వెళ్తున్నారు. ఆయన కొల్హాపూర్ లోని శ్రీ మహాలక్ష్మీ ఆలయాన్ని సందర్శించి అక్కడ.. ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం షిర్డికి చేరుకోనున్నారు. షిర్డీలో సాయిబాబా దేవాలయాన్ని దర్శి్స్తారని టీడీపీ పార్టీ వర్గాలు తెలిపాయి.
Read Also: SVC59 : విజయ్ సరసన నటించనున్న ఆ స్టార్ హీరోయిన్..?
అలాగే, ఎన్నికలు పూర్తైన తర్వాత చంద్రబాబు నాయుడు వరుసగా ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శిస్తున్నారు. ఇటీవల వారణాసిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నామినేషన్ కార్యక్రమానికి హాజరైన ఆయన ఆ తర్వాత నేడు నేడు మహారాష్ట్ర వెళ్లనున్నారు. ప్రచారాన్ని ముగించిన సమయంలోనూ చంద్రబాబు చివరి రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు తమదేనని ధీమాతో ఉన్న చంద్రబాబు ఆలయాల సందర్శనలో బిజీబిజీగా గడుపుతున్నారు.