Shirdi Tour: షిర్డీ వెళ్లే యాత్రికులకు తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ శుభవార్త అందించింది. షిర్డీ వెళ్లాలనుకునే భక్తుల కోసం తెలంగాణ టూరిజం శాఖ రెండు ప్రత్యేక ప్యాకేజీలను తీసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి షిర్డీకి తక్కువ ధరకే ప్యాకేజీలు ప్రకటించింది. రెండు రాత్రులు, ఒక పగలు సాగే ఈ పర్యటనను ఏసీ, నాన్ ఏసీ ప్యాకేజీలుగా అధికారులు విభజించారు. ఏసీ బస్సులో ప్రయాణానికి టికెట్ ధరలు పెద్దలకు రూ.3,700, పిల్లలకు రూ.3,010గా నిర్ణయించారు. నాన్ ఏసీ బస్సులో ప్రయాణించేందుకు పెద్దలకు రూ.2,400, పిల్లలకు రూ.1,970 టికెట్ ధరలు నిర్ణయించారు. ప్రతిరోజూ సాయంత్రం హైదరాబాద్‌లోని ఎంపిక చేసిన పికప్ పాయింట్ల నుండి బస్సులు బయలుదేరుతాయి. బషీర్‌బాగ్, ప్యారడైజ్, బేగంపేట్, కేపీహెచ్‌బీ, దిల్‌షుక్‌నగర్, మియాపూర్ పికప్ పాయింట్ల నుంచి సాయంత్రం బస్సులు షిర్డీకి బయలుదేరుతాయని టీఎస్‌టీడీసీ అధికారులు వెల్లడించారు.
Read also: Beer Powder : కేసులు కేసులు కాదు.. ప్యాకెట్లు ప్యాకెట్లు బీరు కొట్టేయొచ్చు
బస్సులు హోటళ్లలో ఉదయం 7 గంటలకు షిర్డీకి చేరుకుంటాయి. ప్రయాణికులు సిద్ధమైన తర్వాత బస్సులు దర్శనానికి బయలుదేరుతాయి. ప్రధాన దర్శనం తర్వాత, సమీపంలోని మరికొన్ని ఆలయాలను కూడా సందర్శించవచ్చు. బస్సు షిర్డీ నుండి సాయంత్రం 4 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6:30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. ఆలయ అధికారిక వెబ్‌సైట్‌లో దర్శన టిక్కెట్లను ముందుగానే బుక్ చేసుకోవాలని సూచించారు. ఈ పర్యటనలో షిర్డీ సాయినాథుని దర్శనం టిక్కెట్ సౌకర్యం చేర్చబడలేదు. బాబా దర్శనం కోసం భక్తులు ముందుగానే టిక్కెట్లు రిజర్వ్ చేసుకోవాలి. అలాగే మధ్యాహ్న భోజన ఏర్పాట్ల కోసం భక్తులు తమ సొంత ఖర్చులు భరించాల్సి ఉంటుంది. టూర్‌కు సంబంధించిన మరిన్ని వివరాలకు https://tourism.telangana.gov.in/package/ShirdiTour వెబ్‌సైట్‌ను సందర్శించాలని భక్తులకు అధికారులు సూచించారు. షిర్డీ వెళ్లాలనుకునే భక్తులకు ఇది బెస్ట్ ఆఫర్ అని టీఎస్‌టీడీసీ అధికారులు వెల్లడించారు.
RTC Kalabhavan: ఆర్టీసీ కళా భవన్ సీజ్.. అద్దె కట్టకపోవటం వల్లే..!