Sandeshkhali: పశ్చిమ బెంగాల్ సందేశ్‌ఖాలీ ప్రాంతం ఇటీవల అల్లర్లతో అట్టుడికింది. మాజీ తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేత షేక్ షాజహాన్, అతని అనుచరులు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. దీంతో అక్కడి మహిళా లోకం వీరికి వ్యతిరేకంగా ఎదురుతిరిగింది. వారిని అరెస్ట్ చేయాలని టీఎంసీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భూ కబ్జా, మహిళలపై వేధింపులు, రేషన్ కుంభకోణం, ఈడీ అధికారులపై దాడి ఇలా పలు కేసులో షేక్ షాజహాన్ నిందితుడిగా ఉన్నాడు. 55 రోజుల పాటు పరారీలో ఉన్న…
Sandeshkhali: పశ్చిమ బెంగాల్ సందేశ్‌ఖాలీ ఘటన నిందితుడు షేక్ షాజహాన్ టార్గెట్‌గా ఈడీ ఈ రోజు భారీ దాడులు నిర్వహిస్తోంది. తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) మాజీ నేత షేక్ షాజహాన్ అరెస్ట్ తర్వాత ఈడీ, పారామిలిటరీ బలగాలు ఈ రోజు నాలుగు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించాయి. మహిళా బలగాలను కూడా రంగంలోకి దింపారు. ఈడీ అధికారులు గురువారం ఉదయం 6.30 గంటలకు షేక్ షాజహాన్‌కి చెందిన ఇటుక బట్టితో పాటు ధమఖలీ అనే ప్రాంతంలో సోదాలు నిర్వహిస్తున్నాయి.
పశ్చిమబెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో షాజహాన్ షేక్‌ను సీబీఐకి అప్పగించడంలో కొనసాగిన హైడ్రామాకు తెరపడింది. కోర్టు హెచ్చరికల నేపథ్యంలో బెంగాల్ పోలీసులు ఎట్టకేలకు అతడిని సీబీఐకి అప్పగించారు.
ప్రధాని మోడీ (PM Modi) పశ్చిమబెంగాల్‌లో పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని ప్రారంభించారు. కోల్‌కతాలో అండర్ వాటర్‌లో నిర్మించిన మెట్రో రైలును మోడీ ప్రారంభించారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఇండియా కూటమిపై మరోసారి ప్రధాని మోడీ విరుచుకుపడ్డారు. సందేశ్‌ఖాలీ మహిళల బాధల కంటే.. కొంత మంది ఓట్లే మమతకు ముఖ్యమని ఆరోపించారు.
Calcutta High Court: పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ నేత షేక్ షాజహాన్‌ని ఎట్టకేలకు 50 రోజుల తర్వాత పోలీసులు అరెస్ట్ చేశారు. భూ కుంభకోణంలో విచారణ జరిపేందుకు వచ్చిన ఈడీ అధికారులపై ఇతని అనుచరులు దాడులకు తెగబడ్డారు. అంతే కాకుండా సందేశ్‌ఖలి ప్రాంతంలో మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడ్డారు. దీంతో బెంగాల్‌లోని సందేశ్‌ఖలిలో మహిళలు, యువత టీఎంసీ లీడర్లకు వ్యతిరేకంగా ఉద్యమించింది. 55 రోజుల పరారీ తర్వాత అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Sheikh Shahjahan: పశ్చిమబెంగాల్ తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేత షేక్ షాజహాన్‌పై ఆ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. ఆరేళ్ల పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. పదుల సంఖ్యలో కేసులు ఉండటంతో పాటు ఇటీవల సందేశ్‌ఖలీలో మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడినట్లు అక్కడి ప్రజలు ఉద్యమించారు.
గత కొద్ది రోజులుగా సందేశ్‌ఖాలీ (Sandeshkhali) ఘటనతో పశ్చిమబెంగాల్ (West Bengal) అట్టుడుకుతోంది. దీంతో సందేశ్‌ఖాలీ ఘటనకు కారకులపై ముఖ్యమంత్రి మమత బెనర్జీ (Mamata Banerjee) చర్యలు తీసుకోకపోవడంపై ఆ రాష్ట్ర హైకోర్టు సీరియస్ అయింది.