పశ్చిమబెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో షాజహాన్ షేక్‌ను సీబీఐకి అప్పగించడంలో కొనసాగిన హైడ్రామాకు తెరపడింది. కోర్టు హెచ్చరికల నేపథ్యంలో బెంగాల్ పోలీసులు ఎట్టకేలకు అతడిని సీబీఐకి అప్పగించారు.
సందేశ్‌ఖాలీలో ఈడీ అధికారులపై దాడి కేసులో ప్రధాన నిందితుడైన షాజహాన్ షేక్‌ను పోలీసులు ఎట్టకేలకు సీబీఐకి అప్పగించారు. బుధవారం సాయంత్రం 4.15గంటల కల్లా ఎట్టి పరిస్థితుల్లో అతడిని, కేసు వివరాలను కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI)కి అప్పగించాల్సిందేనంటూ కలకత్తా హైకోర్టు డెడ్‌లైన్ విధించింది. దీంతో రెండు రోజులుగా బెంగాల్ ప్రభుత్వం, కేంద్ర ఏజెన్సీల మధ్య కొనసాగిన హైడ్రామాకు తెరపడినట్లయింది. సందేశ్‌ఖాలీలో దోపిడీ, భూకబ్జాలు, లైంగిక వేధింపుల కేసుల్లో షాజహాన్ షేక్ కీలక నిందితుడిగా ఉన్నారు.
ఇదిలా ఉంటే బుధవారం ప్రధాని మోడీ సందేశ్‌ఖాలీ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా సందేశ్‌ఖాలీ మహిళా బాధితులు ప్రధాని మోడీని కలిశారు. ఈ సందర్భంగా తమకు జరిగిన అన్యాయాన్ని ప్రధానికి వివరించారు. దీంతో వారి ఆవేదన విని మోడీ కలత చెందారు.
మొత్తానికి తీవ్ర ఉత్కంఠ మధ్య సందేశ్‌ఖాలీ నిందితుడు షాజహాన్‌ను సీబీఐకి పోలీసులు అప్పగించారు.