Money laundering case: తృణమూల్ మాజీ నేత షేక్ షాజహాన్‌ని అరెస్ట్ చేసిన ఈడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Money laundering case: పశ్చిమ బెంగాల్ సందేశ్‌ఖాలీ నిందితుడు షేక్ షాజహాన్‌ని మనీలాండరింగ్ కేసులో ఈడీ ఈ రోజు అరెస్ట్ చేసింది. సందేశ్‌ఖాలీలో భూకబ్జాలు, మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసుల్లో ఇతను ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. బసిర్‌హత్ జైలులో ఉన్న అతడిని విచారించిన అధికారులు, ఆ తర్వాత అరెస్ట్ చేశారు. రేషన్ కుంభకోణం కేసులో విచారణకు వెళ్లిన ఈడీ అధికారులపై షేక్ షాజహాన్ అతడి అనుచరులు ఫిబ్రవరిలో దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
Read Also: CM YS Jagan: 7 కిలోమీటర్ల మేర సీఎంతో పాటు కదిలిన జనప్రభంజనం
Also Read
- Nandigram Bypoll 2026: నందిగ్రామ్ ఉపఎన్నికలో బీజేపీ సంచలన నిర్ణయం.. శుభేందు అధికారి దివంగత పీఏ తల్లికి టికెట్
- Vijay Sethupathi: ‘నాయకత్వం అంటే ఇది కాదు’.. హాట్ టాపిక్‌గా మారినా విజయ్ సేతుపతి వ్యాఖ్యలు..
- Rajouri Terror Module Busted: రాజౌరీలో లష్కర్-ఎ-తైబా నెట్వర్క్ గుట్టురట్టు.. ముగ్గురు అరెస్ట్, IED స్వాధీనం
- Inspiring Story: వినలేరు.. మాట్లాడలేరు.. అయినా 45 ఏళ్ల వయసులో 10వ తరగతి పాస్.. కొడుకే తల్లికి గురువు
ఈ పరిణామం తర్వాత సందేశ్‌ఖాలీలో మహిళలపై తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) పార్టీకి చెందిన షాజహాన్, అతడి అనుచరులు అత్యాచారాలకు, అఘాయిత్యాలకు పాల్పడటంతో అక్కడి మహిళా లోకం ఒక్కసారిగా ఉద్యమించింది. పరారీలో ఉన్న షేక్ షాజహాన్‌ని అరెస్ట్ చేసి, శిక్షించాలని మమతా బెనర్జీ సర్కార్‌ని డిమాండ్ చేశారు. ఈ పరిణామాలతో షేక్ షాజహాన్ పేరు ఒక్కసారిగా దేశవ్యాప్తంగా రాజకీయాల్లో సంచలనంగా మారింది.
ఈడీపై దాడి తర్వాత దాదాపుగా 55 రోజుల పరారీలో ఉన్న అతడిని అరెస్ట్ చేసే అధికారి సీబీఐ, ఈడీకి ఉందని కలకత్తా హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కోర్టు అతడిని సీబీఐ కస్టడీకి అప్పగించింది. ఈ వివాదాల నేపథ్యంలో టీఎంసీ షాజహాన్‌ని పార్టీ నుంచి 6 ఏళ్ల పాటు సస్పెండ్ చేసింది. ఈడీ సోమవారం బసిర్‌హత్ కోర్టులో వారెంట్ సమర్పించి, షాజహాన్ రిమాండ్ కోరే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Petrol and Diesel Price Hike: పాక్‌లో మళ్లీ పెరిగిన పెట్రో ధరలు.. లీటర్ రూ.409
-
Nandigram Bypoll 2026: నందిగ్రామ్ ఉపఎన్నికలో బీజేపీ సంచలన నిర్ణయం.. శుభేందు అధికారి దివంగత పీఏ తల్లికి టికెట్
-
CM Revanth Reddy: తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
Mukesh Kumar: టీమిండియా పేసర్‌కు బంపర్ ఆఫర్.. ఇదే మొదటిసారి!
-
Group 1 Notification 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల..
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!