Bangladesh: బంగ్లాదేశ్లోని షేక్ హసీనా ప్యాలెస్ ‘‘విప్లవ మ్యూజియం’’గా మారుతుందని ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్ సోమవారం తెలిపారు. హసీనాకు చెందిన విలాసవంతమైన ప్యాలెస్ నుంచి ఆమె పారిపోయేలా చేసిన విప్లవానికి గుర్తుగా ఈ మ్యూజియం మారుతుందని యూనస్ చెప్పారు. ఈ మ్యూజియంలో ఆమె దుర్మార్గమైన పరిపాలన, ఆమెను అధికారం నుంచి తొలగించిన ప్రజలు విప్లవాన్ని భద్రపరుస్తుందని చెప్పారు.
Bangladesh : బంగ్లాదేశ్ కొత్త తాత్కాలిక ప్రభుత్వం దేశంలో నిరంతరం అనేక మార్పులు చేస్తోంది. అవామీ లీగ్ విద్యార్థి విభాగం గురించి ఎలాంటి వార్తలను ప్రచురించవద్దని బంగ్లాదేశ్ ముఖ్య సలహాదారు ప్రత్యేక సహాయకుడు మహ్ఫూజ్ ఆలం గురువారం జర్నలిస్టులను కోరారు. ఇది ఇప్పుడు నిషేధిత సంస్థ అని, ఉగ్రవాద సంస్థ ప్రచారంలో మీరు ఎటువంటి పాత్ర పోషించవద్దని అన్నారు. జర్నలిస్టులను హెచ్చరిస్తూనే, మధ్యంతర ప్రభుత్వం మీడియా స్వేచ్ఛపై ఎలాంటి దాడిని సహించదని, దానిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని…
Bangladesh Protests: బంగ్లాదేశ్లో మరోసారి ఆందోళనలు కొనసాగుతున్నాయి. దేశ అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్ రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాలు, నిరసనకారులు డిమాండ్ చేస్తూ అధ్యక్ష భవనం ‘బంగా భబన్’ను చుట్టుముట్టారు.
Bangladesh: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఆ దేశంలోని అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ గురువారం ఆమెకు వారెంట్ ఇష్యూ చేసింది. ఈ ఏడాది జరిగిన రిజర్వేషన్ వ్యతిరేక ఆందోళనల్లో షేక్ హసీనా మానవత్వానికి వ్యతిరేకంగా ప్రవర్తించినట్లు, పలువురి చావుకు కారణమైనట్లు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఆగస్టులో అక్కడి పరిస్థితులు హింసాత్మకంగా మారడంతో హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చారు.
Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, అవామీ లీగ్ పార్టీ అధినేత్రి షేక్ హసీనాపై బంగ్లాదేశ్లోని ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఆగస్టు నెలలో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చెలరేగిన అల్లర్లలో అప్పటి ప్రధానిగా ఉన్న షేక్ హసీనా మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. షేక్ హసీనాతో పాటు అవామీ లీగ్ నేతలతో సహా 45 మందికి అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది.
Bangladesh: బంగ్లాదేశ్ పాకిస్తాన్లా తయారయ్యేందుకు ఎంతో కాలం పట్టేలా కనిపించడం లేదు. ఓ విధంగా చెప్పాలంటే పాకిస్తాన్ని మించి మతఛాందసవాద రాజ్యంగా మారేలా బంగ్లాదేశ్ పరిస్థితులు ఉన్నాయి.
Bangladesh: రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ బంగ్లాదేశ్ వ్యాప్తంగా హింసాత్మక నిరసనలు జరిగాయి. ఆ తర్వాత పరిణామాల్లో షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి, ఇండియా పారిపోయి వచ్చారు. నోబెల్ గ్రహీత మహ్మద్ యూనస్ ఆధ్వర్యంలో తాత్కిలిక ప్రభుత్వం ఏర్పడింది. ఇదిలా ఉంటే, ఎప్పుడైతే షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయారో, అప్పటి నుంచి ఆ దేశంలో రాడికల్ ఇస్లామిక్ సంస్థలు యాక్టివ్ అయ్యాయి. యూనస్ ప్రభుత్వం పలువురు ర్యాడికల్ ఇస్లామిక్ నేతల్ని విడుదల చేసింది.
Bangladesh: బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయి, ఆమె రాజీనామా చేసి ఇండియాకు పారిపోయి వచ్చినప్పటి నుంచి ఆ దేశంలో హిందువులు, ఇతర మైనారిటీలపై దాడులు ఎక్కువయ్యాయి.
Bangladesh: బంగ్లాదేశ్ నెమ్మనెమ్మదిగా పాకిస్తాన్కి దగ్గరవుతోంది. ఇండియాతో సంబంధాలను తగ్గించుకునే ప్రయత్నం చేస్తోంది. ఎప్పుడైతే షేక్ హసీనా ప్రధాని పదవి నుంచి దిగిపోయిందో అప్పటి నుంచి బంగ్లాదేశ్ వ్యాప్తంగా ఇస్లామిక్ మతోన్మాదులు చెలరేగిపోతున్నారు. నోబెల్ గ్రహీత మహ్మద్ యూనస్ నేతృత్వంలో అక్కడ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది.