షేక్ హసీనా వల్ల భారత్కు ముప్పు ఉందని బంగ్లాదేశ్ ప్రభుత్వ తాత్కాలిక విదేశీ వ్యవహారాల సలహాదారు తౌహీద్ హుస్సేన్ కీలక వ్యాఖ్యలు చేశారు. షేక్ హసీనా విషయంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉందని చెప్పారు. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ మీర్జా ఫక్రుల్ ఇస్లాం ఆలంగీర్ మాట్లాడుతూ, హసీనా భారత్లోనే కొనసాగితే రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు చెడిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
Bangladesh: రిజర్వేషన్ కోటా రిజర్వేషన్ల రద్దు కోసం బంగ్లాదేశ్ అట్టుడికిన విషయం తెలిసిందే. ఈ ఉద్యమం చివరకు షేక్ హసీనా ప్రధాని పదవికి ఎసరు పెట్టింది. ఈ ఆందోళనలు తీవ్రమైన హింసాత్మక చర్యలకు దారి తీయడంతో షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి, ఆగస్టు 5న ఇండియా పారిపోయి వచ్చేసింది.
బంగ్లాదేశ్లో కోటా ఉద్యమం సందర్భంగా అల్లర్లు చెలరేగాయి. ఈ ఘటనలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకొంత మంది క్షతగాత్రులయ్యారు. ఇక షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్కు వచ్చేశారు.
Sheikh Hasina : బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తిరుగుబాటు తర్వాత ఆమె భారత్లో ఆశ్రయం పొందారు. నోబెల్ గ్రహీత మహ్మద్ యూనస్ నాయకత్వంలో అక్కడ మధ్యంతర ప్రభుత్వం ఏర్పడింది.
Bangladesh: భారతదేశంలో ఆశ్రయం పొందుతున్న మాజీ ప్రధాని షేక్ హసీనాను తమకు అప్పగించాలని అధికార బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) సెక్రటరీ జనరల్ మీర్జా ఫఖ్రుల్ ఇస్లాం ఆలంగీర్ భారత్ను కోరారు.
నిరసనల నేపథ్యంలో మాజీ ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి వెళ్లారు.. మహ్మద్ యూనస్ బాధ్యతలు చేపట్టినా.. దేశంలో ప్రజల ఆగ్రహం చల్లారడం లేదు. బంగ్లాదేశ్లో విద్యార్థులతో సహా ప్రజలు మళ్లీ వీధుల్లోకి వచ్చారు.
Bangladesh: బంగ్లాదేశ్ రిజర్వేషన్ కోటాపై ప్రారంభమైన అల్లర్లు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. షేక్ హసీనా తన ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేసి ఇండియా పారిపోయినా, ముహ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినా కూడా అక్కడ పరిస్థితి పూర్తిగా చక్కబడలేదు.
Sheikh Hasina: రిజర్వేషన్ కోటాకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్లో చెలరేగిన అల్లర్ల కారణంగా ఆ దేశ ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి, ఇండియా పారిపోవాల్సి వచ్చింది. ఈ అల్లర్లతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 560కి చేరింది. తాత్కాలిక ప్రభుత్వాధినేతగా నోబెల్ విన్నర్ మహ్మద్ యూనస్ బాధ్యతలు చేపట్టారు.
బంగ్లాదేశ్లో నోబెల్ గ్రహీత యూనస్ ఆధ్వర్యంలో ఏర్పడిన మధ్యంతర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 15న దేశ వ్యవస్థాపక పితామహుడు షేక్ ముజిబుర్ రెహమాన్ మరణాన్ని పురస్కరించుకుని ఇచ్చే సెలవు దినాన్ని తాత్కాలిక ప్రభుత్వం రద్దు చేసింది.