బంగ్లాదేశ్‌లో హిందువులపై హింసాత్మక ఘటనలు నిరంతరం పెరుగుతున్నాయి. యూనస్ ప్రభుత్వ వాదనలు ఉన్నప్పటికీ, మైనారిటీలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. సుమన్‌గంజ్ జిల్లాలో హిందువుల ఇళ్లపై ఛాందసవాదుల గుంపు దాడి చేసింది.
Sheikh Hasina: బంగ్లాదేశ్‌లో ప్రముఖ హిందూ నాయకుడు, ఇస్కాన్ ప్రతినిధి చిన్మోయ్ కృష్ణదాస్ అరెస్ట్ వివాదాస్పదంగా మారింది. దేశద్రోహం కింద ఆయనని బంగ్లా అధికారులు అరెస్ట్ చేశారు. ఈ పరిణామాలపై భారత్ తన ఆందోళనను బంగ్లాదేశ్‌కి తెలియజేసింది. చిన్మోక్ కృష్ణదాస్‌కి మద్దతుగా కోర్టు వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మైనారిటీలపై అక్కడి అధికారులు తీవ్రంగా దాడి చేశారు. ఈ హింసాత్మక అల్లర్లలో ఒక న్యాయవాది కూడా మరణించారు.
Bangladesh: అదానీకి వరసగా షాక్‌లు ఎదురవుతున్నాయి. విద్యుత్ ఒప్పందాల్లో అధికారులకు లంచాలు ఇచ్చాడని అమెరికా సంచలన ఆరోపణలు చేసింది. అయితే, అదానీ గ్రూప్ ఈ ఆరోపణల్ని ఖండించింది. ఈ ఆరోపణలు రావడంతో కెన్యా తమ దేశంలో అదానీ చేపడుతున్న కీలక ప్రాజెక్టుల్ని రద్దు చేసింది.
Bangladesh: బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చిన తర్వాత ఆ దేశంలో మైనారిటీ వ్యతిరేకత, ముఖ్యంగా హిందువులను టార్గెట్ చేస్తూ దాడులు నిర్వహిస్తున్నారు. రాడికల్ ఇస్లామిక్ గ్రూపులు పనిగట్టుకుని హిందువుల వ్యాపారాలు, ఆలయాలు, ఇళ్లపై దాడులు చేస్తున్నారు. రెండు నెలల క్రితం బంగ్లాదేశ్ వ్యాప్తంగా తీవ్ర వరదలు సంభవిస్తే, అక్కడి ప్రజలకు ఆహారాన్ని అందించిన ఇస్కాన్ సంస్థనే ఇప్పుడు బ్యాన్ చేయాలంటూ పెద్ద ఎత్తున ఆన్లైన్ క్యాంపెయినింగ్ నడుస్తోంది.
Bangladesh-Pakistan: షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధానిగా పదవి కోల్పోయిన తర్వాత పాకిస్తాన్-బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు చిగురిస్తున్నాయి. తాజాగా పాకిస్తాన్ కరాచీ నుంచి బంగ్లాదేశ్ చిట్టగాంగ్ పోర్టుకు ఒక కార్గో షిప్ వెళ్లింది. ఇది పాక్-బంగ్లాల మధ్య తొలి సముద్ర సంబంధంగా పేర్కొనబడుతోంది. ఢాకాలోని పాకిస్తాన్ హైకమిషన్ "ద్వైపాక్షిక వాణిజ్యంలో ఒక ప్రధాన అడుగు"గా అభివర్ణించింది, ఈ అభివృద్ధి రెండు దేశాల మధ్య చారిత్రాత్మకంగా బలహీనమైన సంబంధాలలో గణనీయమైన మార్పును సూచిస్తుంది.
Bangladesh: బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వం షేక్ హసీనాను అప్పగించాలని బలంగా కోరుతోంది. భారత్‌లో ఆశ్రయం పొందుతున్న హసీనాని స్వదేశానికి పంపేలా చర్యలు తీసుకోవాలని బంగ్లాదేశ్ ఇంటర్‌పోల్ సాయాన్ని కోరింది. మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలు చేసిందని షేక్ హసీనాపై బంగ్లాదేశ్ ఆరోపణలు చేస్తోంది.
Bangladesh: బంగ్లాదేశ్‌లో ఏదో జరుగుతోంది.. రానున్న కొన్ని రోజుల్లో బంగ్లా రాజకీయాలు వేగంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల డొనాల్డ్ ట్రంప్ గెలిచిన తర్వాత షేక్ హసీనా తనను తాను ప్రధానిగా సంభోదిస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపింది. మరోవైపు ట్రంప్ గెలవడం ప్రస్తుతం బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్‌కి పెద్ద తన నొప్పిగా మారింది.
Bangladesh : బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి మూడు నెలలైంది. ఇప్పుడు ఆయన పార్టీ అవామీ లీగ్ తరపున నిరసన తెలిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం ఢాకాలో ర్యాలీ నిర్వహించనున్నారు.
Donald Trump: డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి రావడంతో బంగ్లాదేశ్‌లో అసలు గేమ్ ప్రారంభం కాబోతోంది. ట్రంప్ గెలిచిన వెంటనే బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా, తనను ప్రధానిగా పేర్కొంటూ శుభాకాంక్షలు చెప్పింది. ఈ పరిణామం ప్రస్తుతం బంగ్లాదేశ్‌లోని తాత్కాలిక ప్రభుత్వానికి క్లియర్ మేసేజ్‌గా చెప్పవచ్చు. నిజానికి ప్రస్తుతం బంగ్లాదేశ్ ప్రభుత్వాధినేతగా ఉన్న మహ్మద్ యూనస్ ట్రంప్‌కి గతం నుంచి గ్యాప్ ఉంది. ట్రంప్‌ని గట్టిగా విమర్శించే వ్యక్తుల్లో మహ్మద్ యూనస్ ఒకరు. మహ్మద్ యూనస్ ప్రస్తుతం…
Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా పార్టీతో పాటు సంకీర్ణ సర్కార్ లోని పార్టీలను కష్టాలు వెంటాడుతున్నాయి. ఢాకాలోని హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ కేంద్ర కార్యాలయంపై దుండగులు దాడి చేశారు.