Bangladesh: బంగ్లాదేశ్ మహ్మద్ యూనస్ ప్రభుత్వంపై మాజీ ప్రధాని షేక్ హసీనా కుమారుడు సంజీబ్ వాజెద్ సంచలన ఆరోపణలు చేశారు. అవామీ లీగ్ నాయకులపై వేధింపుల కోసం న్యాయవ్యవస్థను యూనస్ ప్రభుత్వం ఉపయోగించుకుంటోందని ఆరోపించారు. న్యాయమూర్తులు, ప్రాసిక్యూటర్లు పక్షపాత విచారణ నిర్వహించాలని వాజెద్ కోరారు.
Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై ప్రస్తుతం మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం వరసగా అభియోగాలు మోపుతోంది. ఇప్పటికే ఆగస్టులో చెలరేగిన విద్యార్థుల అల్లర్లలో మానత్వానికి వ్యతిరేకంగా ప్రవర్తించి, పలువురు మరణాలకు కారణమైందనే నేరం ఆమెపై మోపారు.
USA- Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందువులతో పాటు ఇతర మైనారిటీలపై దాడులు కొనసాగుతుండటంతో ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో అక్కడి పరిస్థితులపై ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్‌తో యూఎస్ జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలివన్ మాట్లాడినట్లు పేర్కొనింది.
Bangladesh: భారత దేశంపై మరోసారి బంగ్లాదేశ్ తాతాల్కిక ప్రభుత్వం అక్కసు వెళ్లగక్కింది. తాజాగా, బహిష్కృత ప్రధాని షేక్ హసీనా హయాంలో ప్రజలను బలవంతంగా అదృశ్యమైన ఘటనల వెనుక భారత్ హస్తం ఉందని తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్ ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ ఆరోపించింది.
బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికలపై తాత్కాలిక ప్రభుత్వ నాయకుడు, నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్ కీలక ప్రకటన చేశారు. 2025 చివరలో లేదా 2026 ప్రథమార్థంలో ఎన్నికలు నిర్వహిస్తామని సోమవారం తెలిపారు. ఎన్నికల సంస్కరణలు, ఓటర్ల జాబితా తయారీల ఆధారంగా ఎన్నికల తేదీని నిర్ణయిస్తామని చెప్పారు. బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ 53వ వార్షికోత్సవం సందర్భంగా యూనస్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఎన్నికల సంస్కరణలు, ఓటర్ల జాబితా తయారీ ఆధారంగా సార్వత్రిక ఎన్నికల తేదీని నిర్ణయిస్తాం. ఎన్నికల ప్రక్రియకు కనీసం…
India- Bangladesh: బంగ్లాదేశ్‌లో భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ పర్యటించారు. ఈ సందర్భంగా బంగ్లా తాత్కాలిక ప్రభుత్వ అధిపతి ముహమ్మద్ యూనస్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో యూనస్, మిస్రీల మధ్య 40 నిమిషాల పాటు చర్చ జరిగింది.
Bangladesh: షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయిన తర్వాత బంగ్లాదేశ్‌లోని మహ్మద్ యూనస్ ప్రభుత్వం పాకిస్తాన్‌కి చాలా దగ్గరైంది. 1971 విముక్తి ఉద్యమంలో లక్షలాది మంది బెంగాలీలను చంపిన ఉదంతాన్ని మరిచిపోయి, పాక్‌తో స్నేహం చేస్తోంది. నిజానికి బంగ్లాదేశ్ స్వాతంత్ర్యానికి కారణమైన భారత్‌ని వ్యతిరేకిస్తోంది. ప్రస్తుతం ఆ దేశంలోని హిందూ మైనారిటీలపై మతోన్మాద మూకలు దాడులకు తెగబడుతున్నాయి. భారత్, అంతర్జాతీయ సమాజం నుంచి వస్తున్న అభ్యర్థనను కూడా యూనస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పాక్-బంగ్లా చెట్టాపట్టాల్: బంగ్లాదేశ్‌లో…
డిసెంబర్ 03 రాత్రి మంగ్లార్గావ్, మోనిగావ్ ఈస్ట్ గునిగ్రామ్లలో హిందూ సమాజానికి చెందిన వారిపై గుంపు దాడికి పాల్పడింది. 100 కన్నా ఎక్కువ ఇళ్లు, వ్యాపారాలపై దాడి చేశారు. షాపుల్ని లూటీ చేశారు. ఒక ఆలయాన్ని కూడా ధ్వంసం చేశారు. మొత్తం 1.5 మిలియన్ టాకా( రూ. 10లక్షల)కు పైగా నష్టం వాటిల్లినట్లు కౌన్సిల్ వెల్లడించింది.
బంగ్లాదేశ్‌లో ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్ కరెన్సీ నోట్ల నుంచి షేక్ ముజిబుర్ రెహమాన్ చిత్రం తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఢాకా ట్రిబ్యూన్ నివేదించింది.
Sheikh Hasina: మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా ప్రసంగాలు ప్రసారం కాకుండా బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ నిషేధం విధిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.