Bangladesh: బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చిన తర్వాత ఆ దేశంలో మైనారిటీ వ్యతిరేకత, ముఖ్యంగా హిందువులను టార్గెట్ చేస్తూ దాడులు నిర్వహిస్తున్నారు. రాడికల్ ఇస్లామిక్ గ్రూపులు పనిగట్టుకుని హిందువుల వ్యాపారాలు, ఆలయాలు, ఇళ్లపై దాడులు చేస్తున్నారు. రెండు నెలల క్రితం బంగ్లాదేశ్ వ్యాప్తంగా తీవ్ర వరదలు సంభవిస్తే, అక్కడి ప్రజలకు ఆహారాన్ని అందించిన ఇస్కాన్ సంస్థనే ఇప్పుడు బ్యాన్ చేయాలంటూ పెద్ద ఎత్తున ఆన్‌లైన్ క్యాంపెయినింగ్ నడుస్తోంది.
కొందరు వార్తా ఎడిటర్లతో పాటు రాడికల్ ఇస్లామిస్ట్ గ్రూపులు హిందూ మత సంస్థ ఇస్కాన్ లేదా ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్‌పై నిషేధం విధించాలని పిలుపునిచ్చాయి. ఆగస్టు 05న షేక్ హసీనా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన తర్వాత బంగ్లాదేశ్‌లో విధ్వంసకారుల దాడుల్లో ఇస్కాన్ ఆలయం దెబ్బతింది. అయితే, ప్రస్తుతం ఇస్కాన్‌ని దేశం నుంచి రద్దు చేయాలంటూ పెద్ద ఎత్తన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్‌లో అక్కడి ప్రజలు క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున హిందూ వ్యతిరేక పోస్టులు పెడుతున్నారు.
Read Also: Strong Bones Calcium: ఎముకలు దృఢంగా ఉండాలంటే ఇవి తినాల్సిందే.. క్యాల్షియం కొరత ఉండదు
#BanIskcon అనే హ్యాష్‌ట్యాగ్‌ని ట్రెండ్ చేస్తున్నారు. ఈ సంస్థను తీవ్రవాద సంస్థగా పేర్కొంటూ నిషేధం విధించాలని కోరుతున్నారు. నవంబర్ 05న జరిగిన హింసాకాండలో ఇస్కాన్ సభ్యుల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు రావడంతో ఆన్‌లైన్ ప్రచారం ఊపందుకుంది. మరోవైపు షేక్ హసీనా పార్టీ ‘‘అవామీ లీగ్’’ని కూడా బ్యాన్ చేయాలని పిలుపునిస్తున్నారు. అవామీ లీగ్, ఇస్కాన్‌ని భారత ఏజెంట్లుగా అభివర్ణిస్తూ ఫేస్‌బుక్ పోస్టులు పెడుతున్నారు. ”ఇస్కాన్ అంతర్జాతీయ సంస్థ, ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి ఘటనలకు జరగలేదు. ఇస్కాన్ ఏ దేశానికి చెందిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి ఏజెంట్ కాదు కానీ మానవాళి సంక్షేమం కోసం మాత్రమే పనిచేస్తుంది” అని ఇస్కాన్ ప్రెసిడెంట్ సత్య రంజన్ బరాయ్ అన్నారు.
కొన్ని పోస్టుల్లో ఇజ్రాయిల్, ఇస్కాన్‌కి లింక్ పెడుతున్నారు. ఇస్కాన్ ఇజ్రాయిల్ ప్రమేయంతో పనిచేస్తుందని, ఇస్కాన్‌ని నిషేధించాలని కొందరు పోస్టులు పెడుతున్నారు. ఈ ప్రచారంలో “బంగ్లాదేశ్ రీబార్న్,” “పోస్ట్ రివల్యూషన్ బంగ్లాదేశ్,” “బంగ్లాదేశ్ 2.0,” మరియు “రైజింగ్ బంగ్లాదేశ్” అనేక అకౌంట్స్ ఉన్నాయి. వీటిలో చాలా మంది ఎక్స్ ప్రీమియమ్ సబ్‌స్కైబర్‌లు ఉన్నారు. ఇక యూట్యూబ్ ఛానెళ్లు కూడా ఇదే తరహా ప్రచారాన్ని చేస్తున్నాయి. బంగ్లా రాజకీయాల్లో ఇస్కాన్ జోక్యం చేసుకుంటుందని, షేక్ హసీనాకు మద్దతు ఇవ్వాలని హిందువుల్ని ప్రోత్సహిస్తోందని పేర్కొంటూ వీడియోలు చేస్తున్నారు. బంగ్లాదేశ్‌లో హిందువుల పరిస్థితి బాగా లేదని కథనాలను సృష్టిస్తోందని ఆరోపిస్తున్నాయి.