Sheikh Hasina : బంగ్లాదేశ్‌లో జరిగిన హింసాకాండ తర్వాత ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా బంగ్లాదేశ్‌ను విడిచిపెట్టారు. బంగ్లాదేశ్‌ను విడిచిపెట్టిన కొద్ది గంటల్లోనే ఆమె అధికారిక నివాసం గణ భవన్‌ను ఆందోళనకారులు స్వాధీనం చేసుకున్నారు.
బంగ్లాదేశ్‌లో అల్లర్ల తర్వాత బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా భారత్‌లో తలదాచుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె ఢిల్లీలో ఉంటున్నారు. ఇదే అంశంపై యూకే విదేశాంగ శాఖ కార్యదర్శి డేవిడ్ లామీతో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ ఫోన్లో సంభాషించారు.
PM Modi: షేక్ హసీనా రాజీనామా తర్వాత బంగ్లాదేశ్‌లో నోబెల్ విజేత ముహమ్మద్ యూనస్ ప్రధానిగా తాత్కాలిక ప్రభుత్వాన్ని ఈ రోజు ఏర్పాటు చేశారు. బాధ్యతలు స్వీకరించిన యూనస్‌కి ప్రధాని నరేంద్రమోడీ శుభాకాంక్షలు తెలిపారు. బంగ్లాదేశ్‌లో త్వరగా సాధారణ స్థితికి రావాలని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.
ధైర్యవంతులైన విద్యార్థులు అసాధ్యాన్ని సుసాధ్యం చేశారంటూ బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా వీడియో సందేశం విడుదల చేశారు. ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి భారత్‌కు రాగానే.. జియాను అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్ విడుదల చేశారు.
ఇదిలా ఉంటే మరో కాంగ్రెస్ నేత సజ్జన్ సింగ్ వర్మ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. బంగ్లాదేశ్ మాదిరిగానే భారత్‌లో ఏదో రోజు ప్రధాని నరేంద్రమోడీ ఇంటిని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. షేక్ హసీనాకు పట్టిన గతే ప్రధాని మోడీకి పడుతుందని అన్నారు. బంగ్లాదేశ్‌లో వేలాది మంది నిరసనకారులు సోమవారం ఢాకాలోని షేక్ హసీనా ఇంటిని ముట్టడించారు.
Bangladesh Violence: రిజర్వేషన్ల కోటాపై బంగ్లాదేశ్‌లో చెలరేగిని హింస, చివరకు షేక్ హసీనా తన ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేసి, దేశం వదిలి పారిపోయేలా చేసింది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు కాబోతోంది.
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ప్రస్తుతానికి భారత్‌లోనే ఉంటారని షేక్ హసీనా కుమారుడు సజీబ్ వాజెద్ జాయ్ చెప్పారు. ఇప్పట్లో ఇక్కడి నుంచి వెళ్లే ఆలోచన లేదని తేల్చిచెప్పారు.
Pinaki Bhattacharya: షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధానిగా రాజీనామా చేసి, దేశం వదిలిపారిపోయేలా చేసేందుకు కుట్ర జరిగిందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. షేక్ హసీనాను భారత్ కీలుబొమ్మగా పోలుస్తూ, అడుగడుగున భారత వ్యతిరేకత నింపుకున్న వ్యక్తి ‘పినాకి భట్టాచార్య’. ఫ్రాన్స్‌లో ఉంటున్న ఇతను అక్కడ నుంచే షేక్ హసీనాకు వ్యతిరేకంగా వీడియోలు చేస్తూ దేశంలో అగ్గిరాజేందుకు కీలకంగా వ్యవహరించాడు.
Bangladesh Violence: బంగ్లాదేశ్ హింసాత్మక ఘటనల మధ్య తొలిసారిగా షేక్ హసీనా ప్రత్యర్థి, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ) చీఫ్, మాజీ ప్రధాని ఖలిదా జియా తొలి సందేశాన్ని ఇచ్చారు. షేక్ హసీనా రాజీనామా చేసి దేశం నుంచి పారిపోయిన తర్వాత, ఆ దేశ అధ్యక్షుడు షహబుద్దీన్ జైలులో ఉన్న ఖలిదా జియాను విడుదల చేయాలని ఆదేశించారు.
ఇదిలా ఉంటే, ఒక్క హిందువులనే కాకుండా షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ నేతల్ని టార్గెట్ చేస్తూ విధ్వంసానికి తెగబడుతున్నారు. అవామీ లీగ్ కార్యకర్తలు, నేతల ఇళ్లను చుట్టుముట్టి నిప్పుపెడుతున్నారు.