Minister Seethakka : జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపుతో ఆ పార్టీ నాయకులు సంబరాల్లో మునిగిపోయారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ఫలితాలపై మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడుతూ.. స్థానిక రాజకీయాలన్నీ ప్రజలకు స్పష్టంగా తెలుసు అని అన్నారు. దశాబ్దకాలం పాటు ఏ పని చేయని బీఆర్ఎస్ ఎంత తప్పుడు ప్రచారం చేసినా, జూబ్లీహిల్స్ ఓటర్లు విశ్వసించలేదని ఆమె వ్యాఖ్యానించారు. ప్రజలతో పాటు మంత్రివర్గం, కార్యకర్తలు పటిష్ఠంగా నిలిచినందునే ఈ విజయఫలితం సాధ్యమైందని సీతక్క తెలిపింది. కాంగ్రెస్…
Minister Seethakka : జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎన్నికల వేడి రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి సీతక్క ప్రచారాన్ని మరింత ఉధృతం చేశారు. ఆమెకు అప్పగించిన బోరబండ డివిజన్‌లో మంగళవారం పర్యటిస్తూ ప్రజలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, బీఆర్ఎస్ (BRS) అబద్ధపు ప్రచారానికి తెరదించాల్సిన సమయం వచ్చిందని సీతక్క వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పాలనలో ఉన్న రౌడీ షీటర్లు ఇప్పుడు మంచివాళ్లుగా మారిపోయారా? అని ఆమె ప్రశ్నించారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పై పదే పదే…
Minister Seethakka : జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తరపున మంత్రి సీతక్క ప్రచారం చేశారు. శుక్రవారం బోరబండలో నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లో ఆమె మాట్లాడుతూ… నవీన్ యాదవ్ విజయం జూబ్లీహిల్స్ అభివృద్ధికి కొత్త మలుపు అవుతుందని సీతక్క అన్నారు. మూడు పర్యాయాలు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలిచినా, ఇప్పటికీ ప్రజలు నీటి సమస్యలు, డ్రైనేజ్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. “ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మున్సిపల్ శాఖను స్వయంగా చూస్తున్నారు. కాబట్టి…
Ministers : మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క నేడు మేడారంలో పర్యటించనున్నారు. ఉదయం 10.45 కి గంటలకు వీరిద్దరూ హెలికాప్టర్ లో మేడారంకు చేరుకుంటారు. ముందుగా అమ్మవార్లను దర్శించుకుని, తర్వాత మేడారం మహాజాతర పనులను పరిశీలిస్తారు. జాతర జరిగే ఏరియా మొత్తం వీరిద్దరూ పర్యటించి స్వయంగా పరిశీలించబోతున్నారు. మహా జాతర పనుల పురోగతిపై సీతక్క తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు మంత్రి పొంగులేటి. ఈ సమీక్ష మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరగనుంది. మీటింగ్ తర్వాత…
మేడారం సమ్మక్క-సారలమ్మ ఆలయ అభివృద్ధి పనులపై వస్తున్న వార్తలపై మంత్రి సీతక్క స్పందించారు. ఈ విషయమై పీసీసీ చీఫ్‌కు తాను ఎవరి మీదా ఫిర్యాదు చేయలేదని స్పష్టం చేశారు.
హైదరాబాద్ గాంధీభవన్‌లో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు అధ్యక్షతన మహిళా కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం జరిగింది. అన్ని జిల్లాల మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్న ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
మహిళల సంక్షేమం, సాధికారత పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, వివేక్‌ల సహకారంతో తెలంగాణ మహిళల అభ్యున్నతికి అనేక పథకాలు అమలు చేస్తున్నామని ఆమె స్పష్టం చేశారు.
ములుగు జిల్లా మేడారం మహాజాతర ఏర్పాట్లలో భాగంగా భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొత్త రహదారులు నిర్మించనున్నట్లు రాష్ట్ర మంత్రి సీతక్క ప్రకటించారు.
ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన మేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరను వచ్చే ఏడాది ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో గిరిజన సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేస్తూ రూ.150 కోట్లు మంజూరు చేసింది.