Minister Seethakka : హైదరాబాద్ గాంధీభవన్‌లో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు అధ్యక్షతన మహిళా కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం జరిగింది. అన్ని జిల్లాల మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్న ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ, ఈ నెల 29న గిన్నిస్ రికార్డుల స్థాయిలో బతుకమ్మ పండుగను సరూర్నగర్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. బతుకమ్మ, బోనాలు తెలంగాణ ఆస్తిత్వానికి ప్రతీకలని పేర్కొన్నారు. “ఆస్తులు, అంతస్థులు ఒకరిని ఒకరిని గుర్తింపుగా నిలపవు, కానీ బతుకమ్మ, బోనాలు మాత్రం మన సంస్కృతికి గుర్తింపుగా నిలుస్తాయి” అని సీతక్క అన్నారు.
Crypto Fraud : తెలంగాణలో వెలుగులోకి క్రిప్టో కరెన్సీ మోసం.. రైతుల పేర్లతో రూ.170 కోట్లు..
మాజీ పాలకులను విమర్శిస్తూ ఆమె, “దాండియా వంటి ఆటలను మనమీద రుద్దారు. కానీ తెలంగాణ ఉనికిలోకి వచ్చినప్పటి నుంచి బతుకమ్మ పండుగ మనదైన పద్ధతిలోనే జరుగుతోంది. కొంతమంది తామే బతుకమ్మను తెలంగాణకు నేర్పుతున్నామని ప్రచారం చేసుకున్నారు. కానీ ఈ పండగ మన ఆచారాలు, సంప్రదాయాల్లో ఎప్పటినుంచో ఉంది” అని వ్యాఖ్యానించారు. బతుకమ్మ ఆడే సాంప్రదాయ పద్ధతులను కొనసాగించాల్సిన అవసరం ఉందని సీతక్క పిలుపునిచ్చారు. “చప్పట్లు కొట్టడం, గొంతెత్తి పాడటం ఎంతో ఆరోగ్యదాయకం. అదే అసలు బతుకమ్మ ఆడే విధానం” అని ఆమె స్పష్టం చేశారు.
IND vs PAK: భారత్, పాకిస్థాన్ మ్యాచ్.. ఆసియా కప్ చరిత్రలోనే ఇదే మొదటిసారి!