రైలు ఎక్కేటప్పుడు చెప్పులు జారిపోవడం కామన్ గా ట్రైన్ ప్రయాణికులు ప్రతీ ఒక్కరికి ఇది అనుభవమని ఉంటుంది. ఆ తర్వాత ప్రయాణం అంతా చిరాకుతో గడవడం.. గమ్యస్థానానిక చేరిన తర్వాత ముందుగా ఏ చెప్పుల షాపు కనబడితే అందులోకి దూరి ఏదో ఒక చెప్పులు కొనుక్కుని ఆ తర్వాత ముందుకు సాగుతుంటారు. కానీ కాజీపేట రైల్వే పోలీసులు మాత్రం అలాంటి ఇబ్బంది అవసరం లేదంటున్నారు. రైలు ఎక్కేటప్పుడు ప్రమాదవశాత్తు కింద పడిపోయిన ఓ ప్రయాణికుడి చెప్పును తిరిగి అందించి.. తమ పనితీరును చాటుకున్నారు. ఈ ఘటన కాజీపేటలో జరిగింది. వినడానికి విచిత్రంగా అనిపిస్తున్నా ఇది నిజంగా జరిగింది. బంగారం పోతేనే రికవరీ చేయడం కష్టమైన ఈ రోజుల్లో.. చెప్పును రికవరీ చేశారని తెలిసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు.
Also Read : Ram Charan: గేమ్ చేంజర్ 2024 సమ్మర్ కి షిఫ్ట్ అయ్యిందా? కారణం అతనేనా?
పోలీసుల పనితీరుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే.. శనివారం జనగామ జిల్లా చిలుకూరు పల్లగుట్టకు చెందిన రాజేశ్ అనే యువకుడు సికింద్రాబాద్ వెళ్లాలనుకున్నాడు. దీనికోసం స్టేషన్ ఘన్ పూర్ రైల్వే స్టేషన్ కు వచ్చాడు. అప్పటికే రైలు కదులుతుండడంతో.. కదులుతున్ రైలు ఎక్కబోయాడు.. రైలు అయితే ఎక్కగలిగాడు.. కానీ అతడి కాలికున్న చెప్పు ఒకటి జారి పట్టాల మధ్యలో పడిపోయింది. అది అతడిని బాధించింది. ఎంతో ఇష్టపడి కొనుకున్న చెప్పులు అలా జారిపోవడంతో.. రైల్వే అధికారులకు నాకు చాలా ఇష్టమైన చెప్పులు అవి కొత్తవి జారిపోయాయి..అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ కు సికింద్రాబాద్ డివిజనల్ భద్రతాధికారి దేబాస్మిత్ స్పందించారు. వెంటనే చెప్పును రికవరీ చేయాల్సిందిగా కాజీపేట ఆర్పీఎఫ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.
Also Read : Corona Vaccine: కరోనా టీకా వికటించి ఆస్పత్రుల్లో వారిలో తెలంగాణ సెకండ్..
ఆ సమయంలో అక్కడ విధుల్లో ఉన్న కానిస్టేబుల్ ఆ విద్యార్థి చెప్పును రికవరీ చేశాడు.. ఆ తర్వాత ఆదివారం నాటు కాజీపేటకు తీసుకువచ్చి రాజేశ్ కి అప్పగించారు. సో.. ఈ సారి రైలు ఎక్కుతుంటే చెప్పులు జారిపోతే కంగారు పడాల్సిన అవసరం లేదు.. రైల్వే అధికారులకు ఓ ట్వీట్ చేస్తే చాలు పోయేదేముందు వస్తే.. చెప్పు తిరిగి వస్తుందని సోషల్ మీడియాలో ఈ ట్వీట్ వైరల్ అవుతుంది.