Vande Bharat: ‘వందే భారత్’ రైళ్లలో పరిశుభ్రత లోపించింది. ఈ సెమీ హైస్పీడ్ రైళ్లలో ప్రయాణించే సమయంలో వాటిని పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత ప్రయాణికులపై కూడా ఉంది. మంచినీళ్ల సీసాలు, పాలిథిన్ కవర్లు, ఆహార పదార్థాలు లాంటివి ఎక్కడికక్కడే వదిలేస్తున్నారు. చెత్తా చెదారంతో నిండివున్న వందేభారత్ ఎక్స్ ప్రెస్ బోగీ ఫొటోను ట్విట్టర్ లో పోస్టు చేశారు. అందులో ఓ పారిశుధ్య కార్మికుడు వాటిని శుభ్రం చేస్తున్నారు. అవనిష్ శరణ్ అనే ఐఏఎస్ అధికారి ఈ ఫొటోను ట్విటర్ లో పోస్ట్ చేశారు.
Read Also: Gunfire In USA : అమెరికాలో మరోమారు పేలిన గన్.. ముగ్గురు స్పాట్ డెడ్
దీనిపై వందేభారత్ రైళ్లలో చెత్తను శుభ్రపరిచే పద్ధతిని మార్చాలని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రతిపాదించారు. విమానాల్లో మాదిరిగానే శుభ్రపరిచే విధానాన్ని అమలు చేయాలని మంత్రి సూచించారు. వందేభారత్ రైళ్లలో చెత్తను పట్టించుకోకుండా వదిలేస్తున్నారని సోషల్ మీడియాతో సహా విమర్శలు వెల్లువెత్తడంతో మంత్రి ఈ ఆదేశాలు జారీ చేశారు.
Read Also: Ram – Sita Statue: సీతారామ విగ్రహాల తయారీకి నేపాల్ నుంచి భారీ కొండరాయి
దీని తర్వాత, శుభ్రపరిచే పద్ధతిని సవరించినట్లు పేర్కొంటూ మంత్రి వీడియోను పంచుకున్నారు. సంస్కరణల కోసం ప్రయాణికులు కూడా సహకరించాలని కోరారు. కొత్త పద్ధతి ప్రకారం, వ్యర్థాలను స్వీకరించడానికి ఉద్యోగులే ప్రయాణీకుల సీటు దగ్గరకు చేరుకుంటారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో చెత్త పడి ఉన్న చిత్రాలు విస్తృతంగా ప్రచారం అయ్యాయి. దీంతో ప్రజలు మంత్రిని కలిసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదీ మంత్రి స్పందించారు. చెత్తను పారవేయడానికి, రైళ్లను శుభ్రంగా ఉంచడానికి డస్ట్‌బిన్‌లను ఉపయోగించాలని రైల్వే సంస్థ ప్రయాణికులను కోరింది.