PM Modi Hyderabad tour: మోడీ వేదిక పై ఆ ఇద్దరికీ సీట్లు.. వాళ్ళు వెళతారా మరి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi Hyderabad tour: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేడు హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఉదయం 11.30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. తెలంగాణలో రూ.11,300 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. అక్కడి నుంచి సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించేందుకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు చేరుకుంటుంది. అనంతరం పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే బహిరంగ సభలో ప్రధాని పాల్గొంటారు. అక్కడి నుంచి వర్చువల్‌గా పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరగనున్నాయి.
కానీ మోడీ అధికారిక పర్యటన కావడంతో పరేడ్ గ్రౌండ్‌లో ఆయన పాల్గొనే బహిరంగ సభకు ప్రొటోకాల్ ప్రకారం ఏర్పాట్లు చేశారు. ప్రధాని మోదీతో పాటు పలువురికి ప్రోటోకాల్ ప్రకారం కుర్చీలు ఏర్పాటు చేశారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్, కేంద్రమంత్రులు అశ్విని వైష్ణవ్, కిషన్ రెడ్డితో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర మంత్రులు హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి, మహమూద్ అలీ, కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి (స్థానిక ఎంపీ)తో పాటు మరికొంత మందిని వేదికపై కూర్చోబెట్టారు. కాగా, అధికారిక పర్యటన సందర్భంగా కేసీఆర్‌కు ప్రధాని మోదీ ఆహ్వానం పంపారు. అలాగే మధ్యాహ్నం 12.30 నుంచి 12.37 గంటల వరకు కేసీఆర్ వేదికపై మాట్లాడేందుకు సమయం కేటాయించారు.
Also Read
- TGSPDCL: తెలంగాణలో రికార్డు స్థాయి విద్యుత్ డిమాండ్.. ఈ సింపుల్ టిప్స్‌తో మీ ఇంట్లో కరెంట్‌ను సేవ్ చేయండి..
- OTR: బీజేపీలో 25 మందికి షాక్? ఎమ్మెల్సీ టికెట్‌పై బిగ్ ట్విస్ట్!
- El Nino: ఎల్‌నినో ఎదుర్కొనేందుకు తెలంగాణ సర్కార్ రంగంలోకి ..10 జిల్లాలకు ప్రత్యేక ఐఏఎస్‌లు
- Telangana Bars : తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన బార్ల లక్కీ డ్రా..
అయితే గతంలో మాదిరిగానే ఈసారి కూడా ప్రధాని మోదీ పర్యటనకు సీఎం కేసీఆర్ దూరంగా ఉండనున్నారు. ప్రధాని పర్యటనకు ఆహ్వానిస్తున్న మంత్రిగా పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను రాష్ట్ర ప్రభుత్వం గురువారం నియమించింది. దీంతో బేగంపేట విమానాశ్రయంలో ప్రధాని మోదీకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని స్వాగతం పలకనున్నారు. అలాగే తిరిగి వెళ్లేటప్పుడు వీడ్కోలు పలుకుతారు. ప్రధాని మోదీ పరేడ్ గ్రౌండ్ మీటింగ్ కు కేసీఆర్ దూరంగా ఉంటారని బీఆర్ ఎస్ వర్గాలు తెలిపాయి. అయితే సభా వేదికపై ప్రొటోకాల్ ప్రకారం కుర్చీలు ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది.
IPL 2023 : నువ్వా నేనా చూసుకుందాం.. చెన్నైతో ముంబై ఢీ
తాజావార్తలు
-
LK Advani Health Update: ఐసీయూలో మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ.. హెల్త్ బులిటిన్ విడుదల..
-
Naga Vamsi : భారీ రేట్లు చూసి భయపడ్డా కానీ దసరాకే లాభాల పంట.. నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు
-
Deva : రజనీ బాషా మ్యూజిక్ డైరెక్టర్ మృతి
-
TGSPDCL: తెలంగాణలో రికార్డు స్థాయి విద్యుత్ డిమాండ్.. ఈ సింపుల్ టిప్స్‌తో మీ ఇంట్లో కరెంట్‌ను సేవ్ చేయండి..
-
Katie Zacharia: ట్రంప్‌తో పని చేయడం గౌరవంగా ఉంది.. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా తొలగింపుపై జకారియా కీలక పోస్ట్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?
-
Yoo Ji-won: ఫినిషింగ్ లైన్‌కు 500 మీటర్ల దూరంలో కుప్పకూలిన రన్నింగ్ ఇన్ఫ్లుయెన్సర్.. 25 ఏళ్లకే మృతి..!