Traffic diversion: ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభోత్సవం, అనంతరం పరేడ్ గ్రౌండ్‌లో జరిగే బహిరంగ సభలో ప్రధాని పాల్గొంటారు. దీంతో సికింద్రాబాద్ పరిధిలో శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. చాలా రోడ్లు పూర్తిగా మూసివేయబడతాయి. మరికొన్ని చోట్ల వాహనాలను దారి మళ్లిస్తారు.
ఇటు వెల్లండి..
మోనప్ప జంక్షన్, గ్రీన్ ల్యాండ్స్, ప్రకాష్‌నగర్, రసూల్‌పురా CTO, ఫ్లాజా, SBH, YMCA, సెయింట్ జాన్ రోటరీ, సంగీత్ ఎక్స్ రోడ్, అలుగడబావి, చిలకలగూడ జంక్షన్, MJ రోడ్, RP రోడ్, SP రోడ్డు చాలా రద్దీగా ఉన్నాయి. జంక్షన్ల వైపు వెళ్లవద్దని సూచించారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు వెళ్లే వారు ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని ముందుగానే స్టేషన్‌కు చేరుకోవాలని పోలీసులు తెలిపారు. ఉప్పల్-సికింద్రాబాద్ మార్గంలో కూడా ట్రాఫిక్ రద్దీ ఉంటుందని, ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.
ట్రాఫిక్ ఆంక్షలు
1. టివోలి ఎక్స్ రోడ్స్ నుండి ఫ్లాజా ఎక్స్ రోడ్ వరకు ఇరువైపులా మూసివేయబడతాయి.
2. ఎస్‌బీహెచ్ ఎక్స్ రోడ్స్ నుంచి స్వీకర్.. ఉపకార్ జంక్షన్ వరకు ఇరువైపులా రహదారిని మూసివేస్తారు.
3. చిలకలగూడ, సెయింట్ జాన్స్ రోటరీ, సంగీత్ జంక్షన్, రెటిఫైల్ టి జంక్షన్ నుంచి వచ్చే ప్యాసింజర్ వాహనాలను అనుమతించరు. ప్రయాణికులు క్లాక్ టవర్ పాస్‌పోర్ట్ ఆఫీస్, రెజిమెంటల్ బజార్ మార్గంలో సికింద్రాబాద్ స్టేషన్ మెయిన్ గేట్‌కు చేరుకోవాలి.
4. కరీంనగర్ వైపు నుంచి రాజీవ్ రహదారి మీదుగా నగరానికి వచ్చే వారు ఓఆర్ ఆర్ మీదుగా దిగి కొంపల్లి, సుచిత్ర, బాలానగర్, మూసాపేట్, ఎర్రగడ్డ, ఎస్ ఆర్ నగర్, అమీర్ పేట మీదుగా నగరంలోని ఆయా ప్రాంతాలకు చేరుకోవాలి.
5. కీసర ఓఆర్ఆర్ గేటు నుంచి ఈసీఐఎల్, మౌలాలి, నాచారం, ఉప్పల్ మీదుగా నగరంలోని ఆయా ప్రాంతాలకు చేరుకోవాలి.
6. తిరుమలగిరి క్రాస్ రోడ్డు నుంచి ఎడమవైపునకు వెళ్లి ఏఎస్‌రావునగర్, ఈసీఐఎల్, మౌలాలి, తార్నాక నుంచి నగరంలోని ఆయా ప్రాంతాలకు వెళ్లాలి.
7. కరీంనగర్ వైపు వెళ్లే వారు తిరుమలగిరి క్రాస్‌రోడ్, జేబీఎస్ మార్గాల్లో కాకుండా ఓఆర్‌ఆర్‌లో వెళ్లాలని పోలీసులు సూచించారు.
గంట ముందే బయలు దేరండి..
ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉన్నాయి. దీంతో పదో తరగతి పరీక్షా కేంద్రాలకు వెళ్లే విద్యార్థులు గంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. ట్రాఫిక్‌లో చిక్కుకుపోతే పరీక్షకు ఆలస్యంగా వచ్చే ప్రమాదం ఉందని, విద్యార్థులు, తల్లిదండ్రులు పరీక్షా కేంద్రాలకు గంట ముందే చేరుకునేలా చూడాలన్నారు. అదేవిధంగా ఎస్‌ఎస్‌సీ, ఏఎస్‌సీ పరీక్షలు ఉన్నందున అభ్యర్థులు వీలైనంత త్వరగా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని డీజీపీ అంజనీకుమార్ సూచించారు.
Harry Brook: టెస్టులాడే వ్యక్తికి కోట్లు కుమ్మరించారు..