సికింద్రాబాద్‌కు రఘురామ… సొంత కారులోనే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుంటూరు జిల్లా జైలు నుంచి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజును హైదరాబాద్‌కు తరలిస్తున్నారు పోలీసులు… సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆస్పత్రికి బయల్దేరారు.. సుప్రీంకోర్టు ఉత్తర్వుల తర్వాత జిల్లా జైలు వద్దకు చేరుకున్న రఘురామకృష్ణంరాజు తరపు లాయర్లు.. ఆయనను ఎప్పుడు తరలిస్తారని చాలాసేపు ఎదురుచూశారు.. ఇక, రఘురామను సికింద్రాబాద్ ఆర్మీ హాస్పటల్ కు తరలించే విషయంపై సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ తో మాట్లాడారు అడ్వకేట్ లక్ష్మీనారాయణ… కోర్టు అదేశాలను తాము పాటిస్తామని అడ్వకేట్ కు స్పష్టం చేశారు సీఎస్.. ఆ తర్వాత ఎస్కార్ట్ పోలీసులు.. అరండల్ పేట పోలీసులు జైలు దగ్గరకు చేరుకున్నారు. అయితే, ఎంపీ రఘురామను ఆయన సొంత వాహనంలో తరలించేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు న్యాయవాదులు.. దీనికి పోలీసులు అంగీకారం తెలపడంతో.. ఆ తర్వాత గుంటూరు జిల్లా జైలు నుంచి సికింద్రాబాద్‌కు బయల్దేరారు..
కాగా, రఘురామకు సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.. ఇక, ఈ సమయంలో రఘురామ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నట్టుగా భావించాలని సూచించింది.. తెలంగాణ హైకోర్టు ఒక జ్యుడీషియల్ అధికారిని నామినేట్ చేస్తుందన్న సుప్రీంకోర్టు.. ఆ జ్యుడీషియల్ అధికారి పర్యవేక్షణలో రఘురామకు వైద్య పరీక్షలు నిర్వహించాలంటూ.. ఏపీ చీఫ్ సెక్రటరీ, తెలంగాణ హైకోర్టు రిజిస్టార్‌కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వైద్య పరీక్షలను వీడియోగ్రఫీ చేయాలని.. వైద్య పరీక్షలకు సంబంధించిన నివేదికను సీల్డ్ కవర్‌లో కోర్టుకు సమర్పించాలని స్పష్టం చేసింది.. ఇక, వైద్య పరీక్షల ఖర్చును మొత్తం రఘురామకృష్ణం రాజే భరించాలని పేర్కొంది సుప్రీంకోర్టు. అయితే, ఇప్పటికే రఘురామ ఆరోగ్య పరిస్థితి, గాయాలపై జీజీహెచ్‌లో పరీక్షలు నిర్వహించి వైద్యులు కోర్టుకు నివేదిక ఇవ్వగా.. ఇప్పుడు ఆర్మీ ఆస్పత్రిలో నివేదిక ఎలా ఉండబోతోంది అనే ఉత్కంఠ నెలకొంది.
Also Read
తాజావార్తలు
-
LPG Cylinder Shortage: హోర్ముజ్ సంక్షోభం.. భారత్‌లో ఎల్పీజీ కొరతపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి..
-
42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!
-
India XI vs World XI: ప్రపంచ దిగ్గజాలంత ఓ వైపు.. టీమిండియా ఒక్కటే మరోవైపు.. ఫ్యాన్స్‌కు కేక పుట్టించే బిగ్ మ్యాచ్!
-
Adilabad: ఆదిలాబాద్ రిమ్స్‌లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం.. ఇద్దరు నవజాత శిశువులు మృతి
-
Ayodhya Ram Temple: రామ మందిరంలో 105 సార్లు కానుకలు కొట్టేశారు.. సుప్రీంకోర్టుకు సిట్ సంచలన నివేదిక
ట్రెండింగ్
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్‌ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!
-
200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
-
144Hz డిస్‌ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!