హైదరాబాద్‌లో ఓ బాలుడు నాలాలో కొట్టుకుపోయి మృతిచెందిన ఘటన కలకలం రేపుతోంది.. దీంతో బోయిన్‌పల్లిలో విషాదం నెలకొంది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలో ప్రమాదవశాత్తు చిన్నతోకట్ట నాలాలో పడిపోయాడే ఏడేళ్ల బాలుడు ఆనందసాయి.. నాలా నిర్మాణంలో ఉండగా.. ఇంటిముందు ఆడుకుంటుండగా అందులో పడిపోయాడు… విషయం తెలుకున్న స్థానికులు.. అధికారులకు సమాచారం అందించారు. దీంతో గజ ఈతగాళ్లు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టినా.. ఆ బాలుడు ప్రాణాలు దక్కలేదు.. నాలాలో పడిపోయిన ఆ బాలుడు మృతదేహంగా ఇంటికి చేర్చారు.. దీంతో.. బాలుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. విషయం తెలుసుకున్న వెంటనే సహాయక బృందాలు రంగంలోకి దిగినా.. ప్రాణాలు మాత్రం దక్కలేదు.