హిజ్బుల్లా, ఇరాన్‌తో విభేదాల మధ్య అరబ్ దేశాలు ఇప్పుడు ఇజ్రాయెల్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలాయి. టెహ్రాన్, ఇజ్రాయెల్ మధ్య వివాదంలో తాము తటస్థంగా ఉంటామని ఇరాన్‌కు భరోసా ఇవ్వడానికి అరబ్ దేశాలు ఈ వారం దోహాలో సమావేశమయ్యాయి. ఈ ప్రాంతంలో వివాదాలు పెరగడం వల్ల తమ చమురు కేంద్రాలకు ముప్పు వాటిల్లుతుందని అరబ్ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి.
ఉమ్రా, హజ్ పేరుతో తమ దేశానికి వస్తున్న పాకిస్థానీ యాచకుల సంఖ్య పెరుగుతుండడం పట్ల సౌదీ అరేబియా ఆందోళన వ్యక్తం చేసింది. యాచకులను గల్ఫ్ దేశంలోకి ప్రవేశించకుండా చర్యలు తీసుకోవాలని పాకిస్థాన్‌కి సూచించింది.
Rub al Khali Desert: తెలంగాణకు చెందిన 27 ఏళ్ల వ్యక్తి సౌదీ అరేబియాలో అత్యంత దారుణ పరిస్థితుల్లో మరణించాడు. రబ్ అల్ ఖలీ ఎడాదిలో దిక్కుతోచని స్థితిలో జనావాసాలకు వెళ్లే మార్గం లేకపోవడంతో అధిక అలసట, డీహైడ్రేషన్‌తో విషాదకరమైన స్థితిలో మరణించాడు. సౌదీలోని అల్ హసా ప్రాంతంలో టెలికాం కంపెనీలో మూడేళ్లుగా పనిచేస్తున్న మహ్మద్ షెహజాద్ ఇటీవల తన సహచరుడితో కలిసి ఎడారి ప్రాంతానికి వెళ్లాడు.
Saudi Arabia: సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్(ఎంబీఎస్)పై సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. యెమెన్ లోని హౌతీ తిరుగుబాటుదారులపై సౌదీ యుద్ధాన్ని ప్రారంభించేందుకు ఎంబీఎస్ తన తండ్రి సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు సౌదీకి చెందిన మాజీ అధికారి ఒక నివేదికలో ఆరోపించారు.
Weight Loss: సౌదీ అరేబియా నివాసి ఖలీద్ బిన్ మొహ్సిన్ షరీ ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత బరువైన వ్యక్తిగా గుర్తింపు పొందాడు. 2013లో అతని బరువు 610 కిలోలు. అతడి పరిస్థితి విషమంగా ఉండడంతో మూడేళ్లపాటు మంచానపడ్డాడు. అధిక బరువు కారణంగా ఏ పనీ చేయలేకపోయాడు. చిన్న చిన్న పనులకు కూడా కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల సహాయం తీసుకోవాల్సి వచ్చేది. అతని పరిస్థితి గురించి అప్పటి సౌదీ అరేబియా రాజు అబ్దుల్లాకు తెలిసింది. దాంతో ఖలీద్‌కు…
Pakistan: పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంతో ప్రపంచం ముందు భిక్షమెత్తుకుంటోంది. ఇక పాక ప్రజలు కూడా దీన్నే ఫాలో అవుతున్నారు. ముఖ్యంగా సౌదీ అరేబియా, యూఏఈ వంటి గల్ఫ్ దేశాలకు కూలీలుగా వెళ్తున్న వారు అక్కడ భిక్షాటన చేస్తుండటం ఆ దేశాలకు ఇబ్బందికరంగా మారాయి.
నెట్టింట వైరల్‌గా మారిన వీడియో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా చెప్పుల ధర ఎంత ఉంటుంది. వందలల్లో ఉంటుంది. ఇక కాస్తా ధనవంతులైతే వేలల్లో పెట్టి కొంటారు. మరి బాత్రూంకు వాడే చెప్పులైతే వంద రూపాయలు లేదా ఇంకాస్తా ఎక్కువ పెట్టి కొంటారు. కానీ సౌదీ అరేబియాలోని ఒక దుకాణంలో వేలల్లో కాదు లక్షల్లో అమ్ముతున్నారు.
Hajj pilgrimage: ఈ ఏడాది హజ్ యాత్రలో యాత్రికులు పిట్టల్లా రాలిపోతున్నారు. విపరీతమైన వేడి కారణంగా వీరింతా ప్రాణాలు వదులుతున్నారు. సౌదీ అరేబియా ప్రభుత్వం ప్రకారం.. ఇప్పటి వరకు మరణాల సంఖ్య 1000ని దాటింది.