Pakistan: పాకిస్తాన్ తీరే అక్కడి ప్రజలు.. గల్ఫ్ దేశాల్లో అడుక్కుతింటున్నారు..
- ఆర్థిక సంక్షోభంలో పాకిస్తాన్..
- గల్ఫ్ దేశాల్లో పాక్ ప్రజల భిక్షాటన..
- ఆ దేశ కార్మికులు వద్దంటున్న గల్ఫ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంతో ప్రపంచం ముందు భిక్షమెత్తుకుంటోంది. ఇక పాక ప్రజలు కూడా దీన్నే ఫాలో అవుతున్నారు. ముఖ్యంగా సౌదీ అరేబియా, యూఏఈ వంటి గల్ఫ్ దేశాలకు కూలీలుగా వెళ్తున్న వారు అక్కడ భిక్షాటన చేస్తుండటం ఆ దేశాలకు ఇబ్బందికరంగా మారాయి. గల్ఫ్ దేశాల్లో అరెస్టైన యాచకుల్లో 90 శాతం మంది పాకిస్తానీలే అని కువైట్ ఆందోళన వ్యక్తం చేసింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ), సౌదీ అరేబియా, ఖతార్ మరియు కువైట్‌తో సహా అనేక గల్ఫ్ దేశాలు పాకిస్తాన్ ప్రవాసులు, లేబర్స్‌పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి.
Read Also: Akhilesh Yadav: పార్లమెంట్‌లో వాటర్ లీకేజీపై అఖిలేష్ విమర్శలు
Also Read
ఓవర్సీస్ పాకిస్థానీలపై ఇస్లామాబాద్‌లో జరిగిన సెనేట్ స్టాండింగ్ కమిటీ పాకిస్తానీస్ ప్రతినిధి డాక్టర్ అర్షద్ మహమూద్ ఈ విషయాన్ని లేవనెత్తారు. పాకిస్తానీల ప్రవర్తనపై గల్ఫ్ దేశాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయని అన్నారు. ఈ దేశాల్లోని 50 శాతం నేరాల్లో పాకిస్తానీల ప్రమేయం ఉంటోందని చెప్పారు. యూఏఈ దుబాయ్‌లో మహిళల ముందు వీడియోలు తీస్తున్నారని, కువైట్ పాకిస్తాన్ నర్సుల గురించి సమస్యల్ని లేవనెత్తింది. వారు స్థానిక భాషను నేర్చుకోరు, నేర్చుకునేందుకు ప్రయత్నించరని, దేశంలో ఆరు నెలలు ఉన్న తర్వాత యూరప్ వెళ్లాలని అనుకుంటున్నారని కువైట్ చెప్పింది. తీర్థయాత్రలకని చెప్పి ఇరాన్, సౌదీల్లో పాకిస్తానీలు భిక్షాటన చేస్తున్నారు.
ప్రతీ ఏడాది 6 లక్షల నుంచి 8 లక్షల మంది పాకిస్తానీలు దేశం వదిలివెళ్తున్నారని, కేవలం 2 లక్షల-3 లక్షల మందే తిరిగి వస్తున్నారని అర్షద్ కమిటీ తెలిపింది. ఈ పరిస్థితి దేశానికి చెడ్డపేరు తెస్తుందని కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. నేషనల్ సెంటర్ ఫర్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్‌మెంట్ నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తేనే కార్మికులు ఉపాధి పొందేందుకు అనుమతిస్తామని సౌదీ అరేబియా ఇప్పుడు ప్రకటించింది. మిగతా గల్ఫ్ దేశాలు కూడా పాక్ లేబర్స్‌ని వద్దని చెబుతోంది. ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రతీ ఏడాది విద్యావంతులు పాక్‌ని వదిలేసి వెళ్తున్నారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!